అమెరికా ఎఫిషియన్సీ పెంచే బాధ్యత తీసుకున్న ఎలాన్ మస్క్.. అందు కోసం ఆరుగురు మెరికల్లాంటి కుర్రవాళ్లను ఎంచుకున్నారు. ఈ ఆరుగురిలో ఎవరూ ఇప్పటి వరకూ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించలేదు. కానీ ఇంటర్నీలుగా అన్ని ప్రముఖ సంస్థల్లో పని చేసి.. ఎక్కడికో వెళ్లిపోతారని ప్రశంసలు పొందారు. ఇలాంటి ఆరుగుర్ని పట్టుకుని డోజ్ లో వాళ్లకు కీలక బాధ్యతలు ఇచ్చారు ఎలాన్ మస్క్. వారిలో తెలుగు కుర్రాడు ఆకాష్ బొబ్బా ఒకరు.
తెలుగు మూలాలున్న కుటుంబంలో పుట్టిన అకాష్ బొబ్బా.. ఇరవై ఒక్క ఏళ్లకే ఎలాన్ మస్క్ కంట్లో పడ్డారంటే అతని టాలెంట్ ను అంచనా వేయడం సులువు కావు. ఆకాష్ బొబ్బా ఇంటర్నీగా చేరిన ప్రతీచోటా ప్రశంసలు పొందాడు. మెటా, పలాంటిర్, హెడ్జ్ ఫండ్ బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్‌లో ఇంటర్న్‌గా పనిచేశాడు. ఏఐ; డేటా ఎనాలిసిస్, ఫైనాన్షియల్ మోడలింగ్‌లో అనుభవం ఉంది. ప్రస్తుతం ఆకాష్ బొబ్బా ఆకాశ్ నేరుగా అమెరికా చీఫ్ ఆప్ స్టార్ అమందా స్కేల్స్ కు రిపోర్టు చేస్తారు. ఆయనకు అత్యున్నత స్థాయి వర్గాలకూ అందుబాటులో ఉండని కీలక సమాచారం తీసుకోవడానికి యాక్సెస్ ఉంది.
డోజ్‌ను ఎలాన్ మస్క్ భిన్నంగా నడిపించాలని అనుకుంటున్నారు. అందుకే పూర్తి స్తాయిలో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడం, వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డోజ్ ఏర్పాటైంది. ఈ కొత్త కుర్రాళ్ల ఆలోచనలతో అమెరికాను ఎలా మారుస్తారో చూడాల్సి ఉంది.