స్టార్ షిప్‌లతో ప్రపంచాన్నే కాదు అంతరిక్షాన్ని కూడా దున్నేద్దామనుకుంటున్న ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బలు గట్టిగానే తగులుగుతున్నాయి. ఇటీవల తన స్టార్ షిప్‌ను విజయవంతంగా ఎక్కడ ప్రయోగించారో అక్కడే ల్యాండ్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో మరో అడ్వాన్సుడ్ ప్రయోగాన్ని టెక్సాస్‌లో సంకల్పించారు. దీనికి ట్రంప్ ను ఆహ్వానించారు. ట్రంప్ కూడా వెళ్లారు. స్టార్ షిప్‌ను ప్రయోగించారు.. అది తిరిగి వస్తుందేమోనని అందరూ ఎదురు చూశారు కానీ రాలేదు. టెక్నికల్ గ్లిచ్ రావడంతో సముద్రంలో ల్యాండ్ అయిపోయింది.
స్టార్ షిప్ పేరుతో అంగారకుడిపైకి మనుషుల్ని పంపించాలని తన ప్లాన్ అని మస్క్ చెబుతున్నారు కానీ అసలు ఆయన ప్లాన్ ప్రపంచ విమానయాన రంగాన్ని తన అధీనంలోకి తీసుకోవడం. స్టార్ షిప్‌లతో గంటలో ప్రపంచంలోని ఆ మూల నుంచి ఈ మూలకు మనుషుల్ని చేర్చే ప్రయోగాలు చేయడానికే ప్రస్తుతం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి అనుమతుల కోసమే ఆయన ట్రంప్ కు వందల కోట్ల సాయం చేసి.. ప్రచారంలోనూ కీలకంగా వ్యవహరించారు. విజయంలో కీలక పాత్ర పోషించారని అంటున్నారు.
అమెరికా నుంచి ఢిల్లీకి నలభై నిమిషాల్లో వచ్చేలా చేస్తామని స్పేస్ ఎక్స్ చెబుతోంది. అలాగే ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా మరో మూలకు గంటలో తీసుకెళ్తామని.. ఆ ప్రయోగాలు విజయవంతమవుతాయని అంటున్నారు. ఇలా చేయగలిగితే.. ఇక ప్రపంచ విమానయానరంగం మస్క్ కు దాసోహం అవక తప్పదు.