అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ ఐదో తేదీన జరుగుతాయి. ఇప్పటికే అభ్యర్థుల ప్రచారం పతాక స్థాయికి చేరింది. అభ్యర్థుల మద్దతుదారులు తమకు చేతనైన విధంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌కు ప్రధాన మద్దతుగారుగా టెస్లాతో పాటు ఎక్స్ కు యజమానిగా ఉన్న ఎలాన్ మస్క్ అవతరించారు. ఆయన ట్రంప్ కు మద్దతుగా ఓ రేంజ్ క్యాంపెన్ నిర్వహిస్తున్నారు. తన ఎక్స్ ఖాతా మొత్తం ట్రంప్ కు పబ్లిసిటీ తెచ్చేందుకు ఉపయోగిస్తున్నారు.
ఇటీవల ఎక్స్ లో ట్రంప్‌తో ఇంటర్యూ కూడా నిర్వహించారు. ట్రంప్ అందులో అన్నీ అబద్దాలే చెప్పారని.. అదే ఎక్స్ లో నెటిజన్లు ఆధారాలతో సహా బయట పెట్టారు అది వేరే విషయం. ఇప్పుడు మస్క్ తన కోసం చేస్తున్న కృషిని డొనాల్డ్ ట్రంప్ గుర్తించారు. తాను గెలవగానే తన కేబినెట్లోకి మస్క్ ను తీసుకుంటానని ప్రకటించారు, ఎలాన్ మస్క్ చాలా తెలివైన వ్యక్తి అని కితాబిచ్చారు. ఆయన తెలివైన వ్యక్తి కాబట్టే… ఆ స్థాయిలో ఉన్నారని గుర్తించారో లేకపోతే.. తనకు మద్దతిస్తున్నాడు కాబట్టి మస్క్ తెలివి గల వ్యక్తి అనుకుంటున్నారో ట్రంప్‌కే తెలియాలి.
మొత్తంగా మొదట్లో ట్రంప్‌కు మస్క్ మద్దతు ప్రకటించినప్పుడు … రేసులో ముందున్నారు. కానీ తర్వాత కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఖరారయ్యాక పరిస్థితి మారిపోయింది. అయినా మస్క్ ఓవర్ టైం డ్యూటీ చేసి.. మస్క్ శ్రమ చెమటోడుస్తున్నారు.