అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పని చేసి విజయం సాధించిన ఎలాన్ మస్క్‌కు చాలా ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది ఇటీవల వచ్చిన స్వాగణిక వంశ సినిమా స్వాగ్ స్టోరీ లాంటిది. అచ్చంగా అలాంటిదే.
మస్క్ మొదటి భార్య ద్వారా కన్న పిల్లల్లో ఓ అబ్బాయి ఉన్నాడు. మొదట అమ్మాయి..తర్వాత అబ్బాయి పుట్టారు. జస్టిన్ విల్సన్ అని పేరు పెట్టుకుని ముద్దుగా పెంచుకున్నారు.కానీ ఆ అబ్బాయి పేరు కానీ అన్నీ అమ్మాయి ఆలోచనలే. అచ్చంగా స్వాగ్ సినిమాలోలాగా తండ్రి, కొడుకుల మధ్య రిలేషన్ చెడిపోయింది. ఓ రోజు మస్క్ నుంచి జస్టిన్ విల్సన్ విడిపోయాడు. తన దోవ తాను చూసుకున్నాడు. లింగ మార్పిడి ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. ఇప్పుడు కుమార్తె అయింది. జస్టిన్ విల్సన్ కాస్తా వివియన్ జెన్సా విల్సన్ గా మారిపోయింది.
సహజంగానే ఎలాన్ మస్క్ కి ఇది నచ్చలేదు. దీంతో తండ్రీ, కుమార్తెల మధ్య మాటల్లేకుండా పోయాయి. ట్రంప్ ఇలాంటి లింగ మార్పిడి విధానాలకు వ్యతిరేకం. అందుకే ఇక తాను అమెరికాలో ఉండలేనని ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దానికి మస్క్ కూడా స్పందించారు. తన పెద్ద కుమార్తె చనిపోవడం కన్నా.. జెన్సా విల్సన్ తో విచ్చినా విబేధాలే ఎక్కువ బాధ పెడుతున్నాయని ఆయన అంటున్నారు. అయితే తన కుమారుడు /కుమార్తెతో మళ్లీ దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదన్నారు.
గతంలో తన కుమారుడికి ఏదో సోకిందని ఆయన వ్యాఖ్యానించారు . మస్క్ కు స్వాగ్ లాంటి కథ ఉండటం ఆసక్తికరంగా మారింది.