నకిలీ, సలీం లాంటి సినిమా లతో తెలుగునాట బాగా పాపులర్ అయిన సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని ఇంద్ర సేన అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. నవంబర్ 30 న విడుదల కానుంది ‘ఇంద్రసేన’ . సినిమాలో ‘జీఎస్టీలా నువ్వే వచ్చి ఎంత పని చేస్తివే…’ అనే పాట ఒకటుంది. ఆమధ్య రవితేజ చేతుల మీదుగా వీడియోతో సహా ఆ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి పాటకు మంచి స్పందన కూడా వచ్చింది. కానీ ఇప్పుడా పాట మారిపోయింది. సినిమా విడుదల దగ్గరపడటం తో పబ్లిసిటీ బాగా పెంచారు. కానీ ప్రమోషన్ లో భాగంగా వస్తున్న ట్రైలర్ లో పాట మాత్రం వేరే రకంగా వస్తోంది. మొత్తానికి విజయ్ ఆంటోనీ కి కూడా సెన్సార్ దెబ్బ తగిలింది.
వివరాల్లోకి వెళితే, సెన్సార్ ముందుకు సినిమాను తీసుకు వెళ్లేసరికి ‘జీఎస్టీ’ పదాన్ని తీసేయమని చెప్పారట. ఈ పాట ఏ రకమైన పొలిటికల్ టచ్ లేని సాధారణ డ్యూయెట్. ఏదో పదం బాగుంది కదా అని జీఎస్టీ అనే మాట వాడారు. అయితే దానికి కూడా సెన్సార్ అబ్జెక్షన్ చెప్పారు. దాంతో ‘జీఎస్టీ’ని ఈఎమ్ఐ’గా మార్చి పాటను మళ్లీ సింగర్స్‌తో రికార్డ్ చేయించారు. తెలుగులో ‘అదిరింది’గా విడుదలైన ‘మెర్సల్’లో జీఎస్టీకి వ్యతిరేకంగా రెండు మూడు డైలాగులున్నాయి. వాటిమీద విపరీతమైన రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఇకపై, ఏ సినిమాలోనూ ‘జీఎస్టీ’ అనే
పదం వినబడదేమో!!
ఏది ఏమైనా, బేతాళుడు సినిమాతో డీలా పడ్డ విజయ్ ఆంటోనీ ని మళ్ళీ ఈ ఇంద్రసేన ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలంటే ఈ గురువారం వరకు వెయిట్ చేయాలి.