బ్యాంకుల్లో ఈఎమ్ఐలు వాయిదా వేసుకోవాలనుకున్నవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో మూడునెలల చాన్స్ ఇచ్చింది. ఇప్పటికే మూడు ఈఎంఐలు వాయిదా వేసుకునే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మరో మూడు నెలల పొడిగింపునకు చాన్సిచ్చింది. దీంతో మొత్తం ఆరు నెలల పాటు.. రుణాల వాయిదాలు … చెల్లించకుండా.. వాయిదా వేసుకున్నట్లవుతుంది. పూర్తి నిబఁధనలు బ్యాంకులు విడుదల చేస్తాయి. అయితే.. తొలి మూడు నెలల ఈఎంఐ మారటోరియానికి ఉన్న నిబంధనలే వర్తించే అవకాశం ఉంది. తొలి సారి మూడు నెలలు వాయిదా వేసుకున్న మొత్తం.. అసలుకు కలిపి… వడ్డీ వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. ఈ సారి కూడా అదే నిబంధనలు అమలు చేసే అవకాశం ఉంది.
అన్ని రకాల రుణాలకు.. ఈఎంఐల వాయిదా ఆప్షన్ ఉండటంతో… ఆదాయం కోల్పోయిన వారికి తక్షణ ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆదాయం ఉన్న వారు.. యధావిథిగా రుణాలు చెల్లిస్తేనే ప్రయోజనం లేకపోతే… ఎక్కువ వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరో వైపు.. రుణాలు తక్కువ రేటుకే వచ్చేలా.. రేపోరేటును.. రివర్స్ రెపో రేటును ఆర్బీఐ తగ్గించింది. రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించారు. రివర్స్ రెపోరేటు 3.2 శాతానికి తగ్గించారు. భారత వృద్ధిరేటు మైనస్‌లోకి వెళ్లిపోతుందని ఆర్బీఐ గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో ఆహార భద్రతకు భరోసా ఏర్పడిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ అందరికి అందుబాటులో వచ్చేలా.. వడ్డీ రేట్లను తగ్గించేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. తక్కువ వడ్డీ రేటుకు రుణాలు అందిస్తే.. ఆర్థిక వ్యవస్థలో మళ్లీ కదలకి వస్తుందని.. అంచనా వేస్తున్నారు.