లాక్డౌన్ కారణంగా ప్రజల ఆదాయాలు పడిపోవడంతో.. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం… అన్ని రకాల రుణాలపై మారటోరియం విధించింది. రుణం చెల్లించలేక వాయిదాలు కోరుకునేవారందరికీ.. వాయిదాలు వేసుకునే అవకాశం మారటోరియం ద్వారా కల్పించింది. తొలుత.. మూడు నెలలు.. ఆ తర్వాత మరో మూడు నెలలలు… గడువు పెంచింది. మొత్తం ఆరు నెలలు ఈ ఆగస్టుతో ఆ గడువు పూర్తయింది. మరోసారి ఎలాంటి పొడిగింపు ప్రకటన చేయలేదు. ఇటీవల ఆర్బీఐ తన త్రైమాసిక విధానాన్ని ప్రకటించినా.. ఈ రుణమారటోరియం జోలికి వెళ్లలేదు. అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో… ఈ సారి ఏకంగా రెండేళ్ల పాటు మారటోరియం విధించే అవకాశం ఉందని అఫిడవిట్ దాఖలు చేసింది.
మారటోరియం వల్ల రుణాలు చెల్లించే కాలపరిమితి మాత్రమే పెరుగుతుందని, వడ్డీ మాత్రం చెల్లించాల్సిందేనని గతంలో ఆర్బీఐ స్పష్టం చేసింది. వాస్తవానికి మారటోరియం విషయంపై సుప్రీంకోర్టులో విచారణ జరగడం లేదు. మారటోరియం కారణంగా .. వాయిదాలు ఎంచుకున్న వారిపై.. వడ్డీ మీద వడ్డీ వేయడంపై విచారణ జరుగుతోంది. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ చేయాలని కొంత మంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరుగుతున్న సమయంలో కేంద్రం.. ఏ విధానాన్ని నిర్దిష్టంగా చెప్పడం లేదు. వడ్డీ మాపీ చేస్తే.. పెద్ద ఎత్తున బ్యాంకులకు నష్టం వస్తుందని చెబుతూ వస్తోంది. గత విచారణలో.. ఆర్బీఐ మీదకు నెపం నెట్టేయకుండా.. ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది.
ఈ తరుణంలో… సుప్రీంకోర్టు ఎదుటు కేంద్రం… వివిధ రుణాలపై మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందన్న విషయాన్ని చెప్పింది. లాగే మారటోరియం వ్యవధిలో వడ్డీని పరిగణించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం న్యాయంగా ఆలోచించాలని వ్యాఖ్యానించిన సుప్రీకోర్టు.. ధర్మాసనం వ్యాఖ్యానించారు. బుధవారం.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగనుంది. అప్పుడు రెండేళ్ల మారటోరియం.. వడ్డీ మాఫీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.