శాసనమండలి చైర్మన్, కార్యదర్శికి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్‌లోకి ఉద్యోగ సంఘాలు ఎంటరయ్యాయి. అదేదో ఇద్దరి మధ్య సమరం అన్నట్లుగా.. మండలి చైర్మన్ పై మండి పడుతూ… సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు తెర ముందుకు వచ్చారు. చీఫ్ సెక్రటరీని కలిసి బయటకు వచ్చి రాజకీయ ప్రకటనలు చేశారు. రూల్స్‌కు విరుద్దంగా వెళ్లమని ప్రతిపక్షం అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని .. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన మరింత ఘాటుగా .. తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రూల్స్ లేవు..తొక్కా లేదంటూ యనమల, బోండా ఉమను జైల్లో వేయమని హోంమంత్రి చెబితే ప్రతిపక్షం ఏమంటుందని.. అచ్చంగా వైసీపీ నాయకుడిగా ఓ స్టేట్మెంట్ పడేశారు.
హోంమంత్రి చెప్పారని పోలీసులు వారిని జైల్లో పెడితే ప్రతిపక్షం సమర్థిస్తుందా అనే లాజిక్ కూడా.. ప్రయోగించారు. సచివాలయ ఉద్యోగ సంఘం నేత తీరు చూసి.. మీడియా కూడా ఆశ్చర్యపోయింది. ఎవరైనా ఉద్యోగికి అన్యాయం జరిగితే.. అప్పుడు మాట్లాడినా ఓ అర్థం ఉంటుంది. కానీ.. మండలి చైర్మన్.. మండలి కార్యదర్శి తన విధులను.. సరిగ్గా నిర్వహించడం లేదని రాజ్యాంగ వ్యతిరేకంగా… తన ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని.. ఫిర్యాదు చేసినందుకే… ఉద్యోగ సంఘాల పేరుతో.. వెంకట్రామిరెడ్డి రంగంలోకి దిగిపోయారు. ఇంత వరకూ వైసీపీ నేత కూడా మాట్లాడనట్లుగా మాట్లాడారు.
ఇష్టం వచ్చినట్లుగా అరెస్టులు చేయమని ఆదేశించడానికి హోంమంత్రికైనా… ఎవరికైనా అధికారం ఉండదని.. చివరికి ఆ ఉద్యోగులు కూడా… నిబంధనల ప్రకారమే పని చేయాలన్న విషయాన్ని ఉద్యోగ సంఘం నేతలు మర్చిపోయారు. పాలక పార్టీ చల్లని చూపు కోసం.. ఉద్యోగ సంఘాల నేతలు పాకులాడటంలో.. రాజకీయ పార్టీలపైనా విమర్శలకు దిగుతూండటం.. కొత్త పరిణామంగా కనిపిస్తోంది.