అ.. ఆ సినిమాలో ఏమీ చేయలేక.. ప్రెషర్ బాల్ని పిసుక్కుంటూ ఉంటాడు రావు రమేష్. ఇప్పుడు ఏపీ ఉద్యోగుల పరిస్థితి అంతే ఉంది. నోరెత్తలేరు. నోరెత్తితే ఏం జరుగుతుందో తెలుసు. ఒక వేళ నోరెత్తాలంటే అది ప్రభుత్వానికి అనుకూలంగానో… లేకపోతే ప్రభుత్వం వ్యతిరేకించే వారిపై కులం ప్రకారం అయినా సరే తిట్లు వినిపించడానికో నోరెత్తాలి. అంతే కానీ ఉద్యోగుల ప్రయోజనాల కోసం నోరెత్తే చాన్స్ లేదు. ఓ వైపు పొరుగు రాష్ట్ర ఉద్యోగులు 30 శాతం పీఆర్సీ పొందారు. అక్కడ ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలను పెంచింది. కానీ.. ఏపీలో మాత్రం.. పీఆర్సీ అనే మాట లేదు. పీఆర్సీ కాదు కదా.. అసలు ఇస్తున్న జీతాలు కూడా..కరెక్ట్‌గా ఇస్తారో లేదోనన్న టెన్షన్ వెంటాడుతూనే ఉంది. మొదటి వేవ్ లాక్ డౌన్ సమయంలో రెండు నెలల పాటు కత్తిరించిన సగం.. సగం జీతం ఇంత వరకూ రీ పే చేయలేదని తెలుస్తోంది. దీన్ని కూడా అడిగే పరిస్థితి లేకుండా పోయింది.
2014లో రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కొత్త రాష్ట్రం సాధించుకున్న ఉత్సాహంలో…అలాగే.. పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతగా కేసీఆర్… వారికి 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. నిజానికి తెలంగాణ ధనిక రాష్ట్రం. హైదరాబాద్ దక్కడంతో ఆదాయానికి లోటు లేదు. దీంతో ఉద్యోగుల పంటపండిందని అనుకున్నారు. ఏపీలో ఆర్థిక లోటు . కానీ చంద్రబాబు మాత్రం ఉద్యోగుల్ని నిరాశపర్చకూడదని… తెలంగాణతో పాటుహా 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. మళ్లీ ఐదేళ్లకు ముందే ఎన్నికలకు ఇరవై శాతం మధ్యంతర భృతి కూడా ప్రకటించారు. కానీ… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చందర్బాబు ప్రకటించిన ఐఆర్‌ను కాస్త పెంచారు కానీ.. పీఆర్సీ గురించి మర్చిపోయారు.
చంద్రబాబు హయాంలో ఉద్యోగ సంఘాలు స్వేచ్చగా మాట్లాడేవి. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఎక్కువగా మాట్లాడేవారు. ప్రభుత్వం నుంచి వారికి వేధింపులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. ఉద్యోగుల ప్రయోజనాల గురించి మాట్లాడేవారు లేరు. ప్రభుత్వ ప్రయోజనాల గురించి మాట్లాడటమే సామాజిక బాధ్యత అనుకునేవారు పెరిగిపోయారు. సీపీఎస్ రద్దు కోసం అప్పట్లో ఉద్యమాలు చేసేవారు. ఆ ఉద్యమాల్ని ఉపయోగించుకున్న సీఎం జగన్.. వారంలో సీపీఎస్ రద్దు ఉన్నారు. ఇప్పుడు రెండేళ్లు గడిచినా ఉద్యోగ సంఘాలు నోరెత్తడం లేదు. తెలంగాణలో ఉద్యోగ సంఘాలను కేసీఆర్ గుప్పిట పట్టుకున్నా… వారి కోసం ఎంతో కొంత మేలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో ఉద్యోగ సంఘాలను రాజకీయంగా వాడుకుంటున్నా కనీస మేలు చేయడం లేదన్న అసంతృప్తి ఉద్యోగుల్లో కనిపిస్తోంది. కానీ.. వారేమీ చేయలేని పరిస్థితి. వారి భయం వారిది.