హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడను వాయిదా వేసుకున్నారు. ఉద్యోగులంతా తమ విధులకు హాజరవుతూనే ఉన్నారు. సన్నాహాక సమావేశాలు పెద్దగా పెట్టలేదు. కానీ ప్రభుత్వం మాత్రం వణికిపోయింది. నెల రోజుల ముందు నుంచి సీపీఎస్ ఉద్యోగుల కట్టడి ప్రారంభయింది. ప్రతి ఒక్క టీచర్‌కు.. ఉద్యోగికి.. పోలీసును అటాచ్ చేశారు. నోటీసులు ఇచ్చారు. విజయవాడ వెళ్తే పెద్ద ఎత్తున చర్యలు తీసకుంటామని హెచ్చరించారు. అన్నీ సరిపోవడని.. విజయవాడలో వేల మంది పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు చూసి సామాన్య జనం కూడా నిరసనలను అణిచివేసేందుకు ఇదేం ప్రయత్నం అనుకున్నారు.
చివరికి ముఖ్యమంత్రిని ఇంటిని సీపీఎస్ ఉద్యోగులు ముట్టడించకముందే పోలీసులు .. ఆ పని పూర్తి చేశారు. సీఎం జగన్ ఇంటికి వెళ్లే దారుల్ని మూడు రోజుల ముందే మూసేశారు. రోడ్ల పక్కన నాలుగైదు అడుగుల ఎత్తున ఇనుప ముళ్ల కంచెలు పెట్టారు. ఆ జాగ్రత్తలు చూసిన వారికి.. ఉద్యోగులు. కనీసం రోడ్డెక్కకుండానే వణుకు పుట్టించారన్న అభిప్రాయం కలుగుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామంది సీపీఎస్ ఉద్యోగులు మాత్రమే. వారు రెండు లక్షల మంది ఉంటారు. అందలో యాభై వేల మందయినా ఉద్యమానికి వస్తారో రారో కానీ ప్రభుత్వం మాత్రం అంత కంటే ఎక్కువ మందితోనే జాగ్రత్తలు తీసుకుంది.
సీపీఎస్ రద్దు జగన్ ఇచ్చిన హామీ. ఆ హామీని అమలు చేయకపోతే ఉద్యోగులు ఊరుకునే ప్రశ్నే ఉండదు. ప్రత్యామ్నాయం ఇస్తామని.. మరొకటని చెప్పినా వారు వినడం లేదు. కానీ ప్రభుత్వానికి మాత్రం షాకిస్తామని వారు నిరూపించారు. వారు ఇస్తారో లేదో కానీ వారు ఎక్కడ పరువు తీస్తారోనని ప్రభుత్వం మొత్తం బలగాలను మోహరించుకుంటోంది. సీపీఎస్ ఉద్యోగులు అడుగు బయట పెట్టకుండానే ప్రభుత్వానికి వణుకుపుట్టిస్తున్నారు. ప్రభుత్వాన్ని వారిలా టెన్షన్ పెట్టడం పెద్ద సక్సెస్. ముందు ముందు దీన్ని కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.