ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేరు మీద ప్రారంభమైన అహ్మదాబాద్ కొత్త స్టేడియంలో స్పిన్ గింగరాలు తిరిగింది. ఈ దెబ్బకు మొదటి రోజే.. గట్టిగా యాభై ఓవర్లు కూడా ఆడలేక కుప్పకూలిపోయింది. 48.4 ఓవర్లు మాత్రమే ఆడిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు 112 పరుగులకు ఆలౌటయ్యారు. అక్షర్ పటేల్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ పతనాన్ని శాసించారు. 38 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. తర్వాత అశ్విన్ మూడు వికెట్లు తీశారు. పూర్తిగా స్పిన్‌కు అనుకూలించడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎదురుదాడి చేయలేకపోయారు. టాస్ గెల్చిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం వ్యూహాత్మక తప్పిదమని ఇన్నింగ్స్ ప్రారంభమంలోనే తేలిపోయింది.
పరుగులు రావడం కష్టమవడం మాత్రమే కాదు.. బాల్ కూడా విపరీతంగా టర్న్ అవడం ప్రారంభించింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో చేసిన 112 పరుగుల్లో 53 పరుగుల ఓపెనర్ క్రావ్లీ చేశాడు. ఆరు ఎక్స్‌ట్రాలు వచ్చాయి. మిగతా మిగతా పది మంది కలిపి 53 పరుగులు చేయలేకపోయారు. మూడో టెస్టు మ్యాచ్ డే అండ్ నైట్ పద్దతిలో సాగుతోంది. పింక్ బాల్‌తో సాగే ఈ టెస్టుపై మొదటి నుంచి ఆసక్తి ఏర్పడింది. నూతనంగా నిర్మించిన అతి పెద్ద స్టేడియంలో… అత్యాధునికమైన ఫ్లడ్ లైట్స్ వెలుతురులో ఇండియా ఇన్నింగ్స్ కొనసాగనుంది.
మొదట్లో స్పిన్‌కు అనుకూలించినా రాను రాను బ్యాటింగ్ అనుకూలంగా మారుతుందని స్పిన్ స్వభావాన్ని అంనచా వేయలేకపోయిన ఇంగ్లాండ్ కెప్టెన్ టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్నారని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. భారత్ ఆటగాళ్లు.. ఒకరిద్దరు నిలబడితే… భార్త విజయం సునాయాసమయ్యే అవకాశం ఉంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ , ఇంగ్లాండ్ చెరో మ్యాచ్ గెలుపుతో సమానంగా ఉన్నాయి.