ఇంగ్లండ్ – కివీస్ అనగానే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచే గుర్తొస్తుంది. ఆ మ్యాచ్ టై అవ్వడం, సూపర్ ఓవర్ కూడా టై గా ముగియడం – బౌండరీల సమీకరణంలో ఇంగ్లండ్ గెలవడం – అంత తేలిగ్గా మర్చిపోలేం. ఇప్పుడు వీరిద్దరి మధ్య మరో మ్యాచ్ టైగా ముగిసింది. అయితే ఇది ట్వీ ట్వంటీ మ్యాచ్. సూపర్ ఓవర్‌కి దారి తీసిన ఈ మ్యాచ్‌లో వరల్డ్ కప్‌లా హై డ్రామా జరగలేదు. 9 పరుగుల తేడాతో సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ విజయం సాధించింది.
వర్షం వల్ల 11 ఓవర్లకు కుదిరించిన ఈ 20 – 20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 11 ఓవర్లలో 146 పరుగుల భారీ స్కోరు సాధించింది. బదులుగా బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ 11 ఓవర్లలో సరిగ్గా అన్నే పరుగులు చేసింది. దాంతో సూపర్ ఓవర్ అవసరమైంది. సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ 18 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశిస్తే… కివీస్ కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగింది.