సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరో విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది. విచారణాధికారిగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియాను నియమించింది. ప్రభుత్వం తరఫున ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా అడ్వొకేట్ సర్వ శ్రీనివాసరావు వ్యవహరిస్తారు. ఏప్రిల్‌లో అఖిల భారత సర్వీసు నిబంధన 8 ప్రకారం అభియోగాలు నమోదు చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్.. జీవో విడుదల చేశారు. ఆయనపై గతంలో అనేక ఆరోపణలు చేసి సస్పెన్షన్ వేటు వేసింది. దానిపై కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు సూచనల మేరకు విచారణ జరిగింది. ఆ విచారణకు హాజరైన తర్వాత ఏబీవీ వెంకటేశ్వరరావు కొన్ని వ్యాఖ్యలను మీడియా ఎదుట చేశారు. ఇలా చేయడం.. సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని.. సీఎస్ ఆదిత్యనాథ్ జీవోలో పేర్కొన్నారు. నెల రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఏబీవీ వివరణ పంపిన తర్వాత.. కాస్త ఆలస్యంగా.. జూలై చివరిలోఅంటే.. మంగళవారం రోజున.. ఎంక్వయిరీ కమిషన్‌ను ఆదిత్యనాథ్ దాస్ నియమించారు. ఏబీవీ ఇప్పటికే ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆయన తన సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇంత కాలం సస్పెన్షన్‌లో ఉంచుతారా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గతంలో ప్రభుత్వం చేసిన అభియోగాలపై నివేదికను కమిషనర్ ఎంక్వయిరీస్ సుప్రీంకోర్టుకు సమర్పించారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఒక వేళ సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభిస్తే… ఇప్పుడు మరో విచారణ కమిటీ ద్వారా.. ఈ క్రమశిక్షణా చర్యల పేరుతో ఆయనపై మళ్లీ సస్పెన్షన్ వేటు వేయడానికి అవకాశం ఉంది.
వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో … తాను ఆధారిలిస్తానని..సీబీఐకి లేఖలు రాస్తున్నా.. స్పందించడం లేదని ఏబీ వెంకటేశ్వరరావు అధికారికంగా లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. ఇప్పుడీ ఏబీ వెంకటేశ్వరరావు .. వివేకా హత్య జరిగినప్పుడు.. ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. అంతకు ముందు స్వయంగా డీజీపీ తనపై తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ.. సీబీఐ విచారణ కోసం సీఎస్‌కు లేఖ రాశారు. వీటి మధ్య మరోసారి ఏబీవీపై విచారణ కమిషన్‌ను సీఎస్ ఏర్పాటు చేశారు.