పంపిణీ రంగంలోనే అగ్రగ్రామి సంస్థ ఈరోస్ చేతిలోకి `సాక్ష్యం` సినిమా వెళ్లిపోయింది. పవన్, మహేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలపై దృష్టిపెట్టే ఈరోస్ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి యువ హీరో సినిమాని చేజిక్కించుకోవడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాదాపు రూ.40 కోట్లకు ఈ డీల్ సెట్టయ్యిందని ట్రేడ్ వర్గాల టాక్. రూ.40 కోట్లంటే మామూలు విషయం కాదు. విడుదలకు ముందే… నిర్మాతలు పెట్టుబడిని తిరిగి రాబట్టుకున్నారన్నమాట. ఇప్పటికే `సాక్ష్యం` కొన్ని ఏరియాలు అమ్ముడైపోయాయి. ఆ డీల్స్ అన్నీ ఇప్పుడు ఈరోస్ చూసుకుంటుందన్నమాట. శాటిలైట్, డిజిటల్ రూపంలో ఇప్పటికే నిర్మాతలకు భారీ మొత్తం గిట్టింది. ఏ రకంగా చూసుకున్నా `సాక్ష్యం`తో లాభాలు చేజిక్కించుకున్నట్టే. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. ఈనెల 27న విడుదల కానుంది. సెన్సార్ ఇబ్బందులేమైనా తలెత్తుతుయేమో అన్న అనుమానాలు ఉన్నప్పటికీ.. అవేం పట్టించుకోకుండాఆ చిత్రబృందం ప్రమోషన్లను టాప్ గేర్లోకి తీసుకొచ్చేసింది. ఏదేమైనా సరే.. ఈనెల 27న సాక్ష్యం విడుదల చేస్తామని నిర్మాతలు ధీమాగా చెబుతున్నారు.