రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `వినయ విధేయ రామా`. రెండు పాటల మినహా చిత్రీకరణ పూర్తయింది. అందులో ఓ ఐటెమ్ పాట ఉంది. ఈ పాటలో నర్తించడానికి ఓ కథానాయిక కావాల్సివచ్చింది. చాలా రోజుల నుంచి ఆ కథానాయిక కోసం అన్వేషణ సాగుతోంది. ఈలోపుగా చాలామంది పేర్లు బయటకు వచ్చాయి. చివరికి ఐటెమ్ భామ ఎవరో తేలిపోయింది. ఈ పాటలో చరణ్ పక్కన బాలీవుడ్ భామ ఈషా గుప్తా కనిపించనుంది. `జన్నత్`లాంటి సినిమాతో ఇషా పాపులర్ అయ్యింది. ఆమెకు ఇదే తొలి దక్షిణాది చిత్రం. దేవి శ్రీ ప్రసాద్ ఐటెమ్ పాటల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఆల్రెడీ.. ఓ మంచి ఐటెమ్ నెంబర్ని కంపోజ్ చేసిచ్చేశాడు కూడా. ఈ పాటని ఈనెల 16న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో తెరకెక్కించనున్నారు. ఇప్పటికే టీజర్, ఓ పాటని విడుదల చేసింది చిత్రబృందం. మరో పాటని ఈ వారంలోనే వినిపించనున్నారు. కైరా అడ్వాణీ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.