ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకే వెళ్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన ఈటల రాజేందర్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఈటల… ఈటల బీజేపీని సొంతం చేసుకోవడం లేదని.. బీజేపీ అంటే ఓట్లు పడవనే ఆ పార్టీ పేరు ప్రచారంలో ఈటల ఎక్కడా చెప్పడం లేదన్నారు. రేవంత్, ఈటల తదితరులు టీఆర్ఎస్ పై కుట్ర కు తెరలేపారన్నారని విమర్శించారు. ఓ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈటెలకు ఓటెయ్యాలని లేఖ రాయడం దానికే సంకేతమన్నారు. మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఈటలకు మద్దతు ప్రకటించడాన్ని పరోక్షంగా కేటీఆర్ ప్రస్తావించారు.
ఈటల, రేవంత్ కుమ్మక్కయ్యారని.. కాంగ్రెస్ కు డిపాజిట్ రాదు కానీ రేవంత్ ముందస్తు ఎన్నికల గురించి చిలక జోస్యం చెబుతున్నాడని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక తనను తాను నిరూపించుకోవాలి కదా.. ఎందుకు హుజురాబాద్ వెళ్లడం లేదని రేవంత్‌ని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారని కేటీఆర్ జోస్యం చెప్పారు. అలాగే మాజీ ఎంపీ వివేక్ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారని వినిపిస్తోందన్నారు. ఇటీవల వివేక్‌తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారన్న ప్రచారం కారణంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేరేలా చేయడంలో వివేక్ కీలక పాత్ర పోషించారు.
హుజురాబాద్‌లో ఖచ్చితంగా గెలుస్తామని కేటీఆర్ చెప్పారు కానీ ఆ నమ్మకం ఇతర మాటల్లో వ్యక్తం కాలేదు. హుజురాబాద్ కచ్చితంగా చిన్న ఎన్నిక అని తేల్చేశారు. తాను గెలిస్తే కెసీఆర్ అసెంబ్లీ కి రావద్దని రాజేందర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. మండిపడ్డారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనని.. పశ్చిమ బెంగాల్ లో మమత గెలిస్తే మోడీ దుప్పటి కప్పుకుని పడుకున్నాడా అని ప్రశ్నించారు. ప్రచారానికి తాను వెళ్లడం లేదని.. కేసీఆర్ ప్రచారం కూడా ఖరారు కాలేదని స్పష్టం చేశారు.