తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఇంకాపూర్తి గా బయటకు రాకముందే ఈటల రాజేందర్ తన రాజకీయ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసుకుంటున్నారు. తనకు ఎంత డిమాండ్ ఉందో.. అందరికీ తెలిసేలా చేసుకుంటున్నారు. ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం ఓ వైపు ఉద్ధృతంగా సాగుతోంది. అయితే ఆయన ఈ అంశాన్ని ఎవరికీ ధృవీకరించడం లేదు. కానీ బీజేపీలో మాత్రం చిచ్చుప్రారంభమయింది. బీజేపీ నేత పెద్దిరెడ్డి తన సంగతేమిటని బీజేపీ పెద్దల్ని నిలదీయడం ప్రారంభించారు. ఆయన టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
ఓ వైపు ఈటల కన్ఫర్మ్ చేయకుండా.. మరో వైపు.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు కోసం చర్చలు కూడా జరుపుతున్నారు. కోదండరాం, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో ఈటల చర్చలు జరిపారు. రేవంత్ రెడ్డితో కూడా ఈటల టచ్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందరం కలిసి… కొత్త రాజకీయ వేదిక పెడదామని తొందరపడవద్దని… ఇతర నేతలు.. ఈటలకు సూచిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేస్తే ప్రజల్లో ఆదరణ వస్తుందన్న సర్వేలను వారు ఈటల ముందు ఉంచినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ను ఎదుర్కోవాలి అంటే కేంద్ర లో ఉన్న బీజేపీ సహకారం ఎంతో అవసరమని… ఈటల భావిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీలో కూడా… ఈటల రాజేందర్ చేరికపై..ఓ వర్గం అసంతృప్తిగా ఉంది. ఆయనను పార్టీలోకి తెచ్చి ప్రాధాన్యం కల్పిస్తే. .. ఇప్పటికే ఉన్న నేతలు ఇబ్బంది పడతారని అంటున్నారు. అయితే.. పార్టీలోకి ఎవర్నీ రానియకుండా ఎలా బలపడతారని కేంద్ర పెద్దలు అంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈటలను బీజేపీలో చేర్చుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఆపేందుకు మరో వర్గం ప్రయత్నిస్తోంది. మధ్యలో ఈటల మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు.