తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తనపై చేస్తున్న దాడిని తట్టుకునేందుకు ఈటల రాజేందర్ తన శక్తి సరిపోదని..అధికార బలం కావాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకే కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈటల రాజేందర్ కోసం… భారతీయ జనతా పార్టీ ఢిల్లీ స్థాయి నేతలు రంగంలోకి దిగారు. అదే పనిగా చర్చలు జరిపారు. ఈటల రాజేందర్ పార్టీలోకి వస్తే.. ఆయన టీఆర్ఎస్పై చేస్తున్న పోరాటానికి మద్దతుతో పాటు.. రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని..హుజూరాబాద్నుంచి ఆయన భార్యకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈటల రాజేందర్ బీజేపీ నేతల ఆఫర్లకు… కరిగిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆయన బీజేపీలో చేరిక ముహుర్తం ఖరారైందని.. ఈటల అనుచరులు కూడా చెబుతున్నారు.
నాలుగు రోజుల్లో ఈటల ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. ఆయనను మంత్రివర్గం నుంచి మాత్రమే బర్తరఫ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. దీంతో.. ఆయన బీజేపీలో చేరే రోజే పార్టీకి రాజీనామా చేసి.. ప్రజలకు బహిరంగలేఖ విడుదల చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. తన అనుచరులపై తోడేళ్లలా దాడి చేస్తున్నారని… తను బలహీనంగా ఉంటే.. అందరూ… తనను వదిలి వెళ్లిపోతారన్న ఆలోచనతో… ఈటల బీజేపీ వైపు మొగ్గు చూపినట్లుగా భావిస్తున్నారు. బీజేపీ నేతలజోలికి రావడానికి టీఆర్ఎస్ సాహసహించదన్న అంచనాలో ఉన్నారు.
భారతీయ జనతా పార్టీలో… ఏదైనా కేసుల భయంతో చేరే వారికి భరోసా లభిస్తుంది. అది సీబీఐ కేసులైనా… లేదా… రాష్ట్ర ప్రభుత్వాలు వెంటాడుతున్న కేసులైనా సరే. తమ పార్టీ నేతపై కేసులు పెడితే… బీజేపీ కూడా అంతే దారుణంగా ఇతర పార్టీల నేతలపై ఎటాక్ చేస్తుంది. అనేక రాష్ట్రాల్లో అదే జరిగింది. ఇప్పుడు… ఈటలకు ప్రత్యేకంగా అదే అంశంపై భరోసా ఇస్తున్నందున .. టీఆర్ఎస్ కూడా ఇక ఎక్స్ట్రీమ్ స్టెప్లను ఈటల విషయంలో వేయదన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. కేసీఆర్.. చేజేతులా మరో ఉపఎన్నికను..బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా తెచ్చుకుంటున్నారన్న చర్చ మాత్రం టీఆర్ఎస్లో నడుస్తోంది.