రిపబ్లిక్ డే రోజున కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. కారణం ఏమిటంటే రాజ్భవన్లో జరిగే రిపబ్లిక్ డే వేడుక.. జెండా పండుగకు కేసీఆర్ వెళ్లలేదు. కనీసం సీనియర్ మంత్రిని కూడా పంపలేదు. దీనిపై ఈటల మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ వెళ్ళలేదని, ఇది గవర్నర్ ను అవమానించడమేనని అన్నారు.
గవర్నర్ ఎవరైనా ఉండొచ్చు గాక.. కనీసం గవర్నర్ కుర్చీకి గౌవరం ఇవ్వాలని ఈటల హితవు పలికారు. తమిళిశై గవర్నర్గ ాఉన్నారని రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనకుండా సంప్రదాయాలను కేసీఆర్ తుంగలో తొక్కారని తాను హాజరుకాకుంటే సీనియర్ మంత్రినైనా రాజ్ భవన్ కు పంపించి ఉండాల్సిందని ఈటల విమర్శించారు. రాజ్ భవన్కు, ప్రగతి భవన్కు గ్యాప్ పెరగడం ప్రజలకు క్షేమం కాదన్నారు.
బహుశా.. గవర్నర్గా నరసింహన్ ఉన్నప్పుడు కేసీఆర్ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలకు డుమ్మా కొట్టలేదు. పైగా ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఆ ఉద్దేశంతోనే ఈటల ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే తమిళిసై తెలంగాణ ప్రభుత్వం విషయంలో ఏమంత వ్యతిరేకంగా లేరు. వ్యతిరేక ప్రకటనలు కూడా చేయలేదు. మరి కేసీఆర్ రాజ్ భవన్ రిపబ్లిక్ డే విషయంలో ఎందుకు లైట్ తీసుకున్నారో టీఆర్ఎస్ వర్గాలకూ అంతు చిక్కడం లేదు.