ఈటల రాజేందర్ కాషాయబుక్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన చెప్పారు. అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని తాము కాషాయ బుక్ నిర్వహిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఐఏఎస్ లు, ఐపీఎస్ లు పబ్లిక్ సర్వెంట్లు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పని చేయాలని … ప్రభుత్వంలోని పెద్దలు చెప్పారని నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే ఊరుకునేదిలేదన్నారు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి పట్టిన గతే పడుతుందని ఉదాహరమయగా చెప్పారు. రూల్స్ కు విరుద్ధంగా, ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న అధికారుల పేర్లను కాషాయ బుక్ లో రాసుకుంటున్నామని.. సమయం వచ్చినపుడు లెక్కలతో బయటపెట్టి ఫలితం అనుభవించేలా చేస్తామని హెచ్చరించారు. బాస్‌ల ఆదేశాల ప్రకారం కాకుండా, చట్టప్రకారం నడుచుకోవాలని సలహా ఇచ్చారు. కొంత మంది అధికారులు చేస్తున్న పనులు ఎవరికీ తెలియదని అనుకుంటున్నారని..కానీ ఊరుకోబోమన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం, అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు రాజకీయపార్టీలు అధికార పార్టీతో పాటు అధికారులపై ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం సహజమే కానీ..ఈటల రాజేందర్ కాషాయ బుక్ అనడంతో ఈ టాపిక్ కు ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన నిజం గా రాసుకుంటున్నారో లేదో కానీ.. మొత్తంగా ఈటల రాజేందర్ మాత్రం తమ పార్టీకి కూడా ఓ బుక్ ఉందని ప్రకటించారు.