ఇటలీ ప్రభుత్వం నేరాలు చేసి జైలుకు పోయిన వారికి కొత్త సౌకర్యం కల్పించింది. జైళ్లలో శృంగార గదులను ఏర్పాటు చేసింది. వారు తమ భార్యలు లేదా..సుదీర్ఘంగా సహజీవనం చేస్తున్న వారితో.. రెండు గంటల పాటు శృంగారం చేయడానికి ఆ గదుల్లో అవకాశం కల్పిస్తారు. ఇప్పుడీ సంస్కరణ వైరల్ గా మారింది.
ఓ ఖైదీ తనకు శృంగార సుఖం కావాలని కోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ ను ఇటలీ కోర్టు తిరస్కరించింది. ఆయన రాజ్యాంగ కోర్టుకు వెళ్లాడు. రాజ్యాంగ కోర్టు ఖైదీలూ ఉప్పుకారం తింటారు కాబట్టి .. వారి మానసిక ఆరోగ్యం కోసం అయినా అలాంటి సౌకర్యం ఉండాలని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం పాటించింది. ఓ ఖైదీ మొదటి సారిగా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఇటలీ న్యాయ మంత్రిత్వ శాఖ ఈ అవకాశం వినియోగించుకునేవారి కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. ఖైదీలకు బెడ్ , టాయిలెట్తో కూడిన ప్రైవేట్ గది ఇస్తారు. శృంగారానికి రెండు గంటల సమయం ఇస్తారు. అయితే గది తలుపు అన్లాక్ చేసి ఉంచాలి.
ఇది వింతగా అనిపించవచ్చు కానీ.. టలీనే ఇలాంటి సౌకర్యం అందిస్తున్న మొదటి దేశం కాదు. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, స్వీడన్, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ దేశాలు ఇప్పటికే ఖైదీలకు ఇలాంటి సౌకర్యాలను అందిస్తున్నాయి. ఇటలీ ఈ విషయంలో కొంత వెనుకబడి ఉందని అక్కడి ఖైదీల హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి.