పెగాసస్ వాడారని తేల్చేందుకు ఏర్పాటయిన హౌస్ కమిటీ చీఫ్ భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు డేటా చోరీ గురించే మాట్లాడుతున్నారు. పెగాసస్ ను చంద్రబాబు కొన్నారని మమతా బెనర్జీ చెప్పిందని ఆ మేరకు అసెంబ్లీలో అందరిపై ఆరోపణలు చేసి.. హౌస్ కమిటీ వేశారు. ఇప్పుడు హౌస్ కమిటీ పరిధిని తమకు తాము విస్తరించుకుని గతంలో డేటా చోరీ జరిగిందని ఆ డేటాను బట్టి ఓట్లు తొలగించారని .. అవసరాన్ని బట్టి ఇతరుల్ని పిలిచి ప్రశ్నిస్తామని అంటున్నారు. భూమన చెప్పే డేటా చోరీ కథను తెలంగాణ పోలీసుల సాయంతో గతంలోనే నడిపించారు. ఓ ఐటీ కంపెనీపై దాడి చేసి.. మూయించారు.
టీడీపీ యాప్ లో ఉన్న సమస్త సమాచారాన్నిసేకరించారు. ఈ అంశం తెలంగాణ లో ఐటీ రంగంలనూ చర్చనీయాంశమయింది. ఆధార్ వివరాలు ఎవరూ తీసుకోలేరని ఆధార్ సంస్థ కోర్టుకు తెలిపింది. ఓటర్లు ఎవరివీ డిలేట్ కాలేదని ఈసీ చెప్పింది. ఆధార్ చోరీ అనేది జరగదని కూడా తేల్చింది. దాంతో ఆ కేసు తేలిపోయింది. కానీ డేటా చోరీ పేరుతో టీడీపీపై చేసిన దుష్ప్రచారం వర్కవుట్ అయింది. ఇప్పుడు కూడా దాన్ని బయటకు తీసుకువచ్చి..రాజకీయం చేసుకోవాలన్న ఆలోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఇప్పటికీ ఆ అంశం కోర్టులోనే ఉంది తేలలేదు. ఇప్పుడు హౌస్ కమిటీ పేరుతో విచారణ చేసి ఏం చేస్తారు.. ఈ హౌస్ కమిటీకి ఆ అంశాలపై విచారణ చేసే హక్కు ఉందా అన్న వివరాలపై చాలా గందరగోళం ఉంది. అయితే ఏపీలో రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ అధికార పార్టీ వారికి ఉండవు కాబట్టి వారు చేయాలనుకున్నది వారు చేస్తారు. వారికి ఉన్న మీడియా .. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో ప్రచారం చేస్తారు. బురద ఎవరికి పూస్తారో వారే తుడుచుకోవాలి.