గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఇప్పుడు ఇంటి నెంబర్లు కూడా పెద్ద సమస్యే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రపంచ స్థాయి సౌకర్యాల కల్పనకు అధికారులు వేగంగా ముందడుగు వేస్తున్నారు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మెషన్ సిస్టం సర్వేను ఇప్పటికే అధికారులు ప్రారంభించారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత ప్రతి ఇంటికి ఒక యూనిక్ ఐడీ నంబర్ వస్తుంది. దానితో పాటుగా క్యూఆర్ కోడ్ లాంటి ఒక బోర్డును కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా ఆ ఇంటింకి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. లొకేషన్ కూడా వస్తుంది.
హైదరాబాద్లో ఇప్పుడు ఓ ఇల్లు అడ్రస్ తెలుసుకోవడం అంత తేలిక కాదు. డెలివరీ కంపెనీలన్నీ ఇప్పుడు అడ్రస్ అడగడం లేదు. మ్యాప్స్ మార్క్ చేసుకుంటున్నాయి. చాలా మంది ఇప్పుడు లొకేషన్ పంపమని కోరుతున్నారు. తమ ఇన్విటేషన్లపై లొకేషన్ క్యూఆర్ కోడ్ ను ముద్రిస్తున్నారు. అయిత అందరికీ ఇది సాధ్యం కాదు. అందుకే నేరుగా… ప్రతి ఇంటికి ఓ క్యూఆర్ కోడ్ ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. కాలనీలు, ఇళ్లకు సంబంధించి సమస్యలను పరిష్కరించడంలో కూడా ఈ కోడ్ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది.
ఈ జీఐఎస్ సర్వేని హైదరాబాద ్శాటిలైట్, గ్రౌండ్ ఫిజికల్ విధానంలో నిర్వహిస్తారు. ఇప్పటికే హైదర్ నగర్, మియాపూర్, చందానగర్, కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్, హయత్ నగర్ వంటి 5 సర్కిల్స్ లో ప్రయోగాత్మకంగా సర్వే ప్రారంభించారు. 130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తయింది. సర్వేలో కేవలం అవసరమైన డాక్యుమెంట్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్, యుటిలిటీస్ వంటి వివరాలు మాత్రమే సేకరిస్తారు.
ముందుగా హైదరాబాద్లోని ప్రతి ఇంటికి సరైన అడ్రస్ ఉంటే.. తర్వాత వచ్చే అనేక రకాల సమస్యలను ఎలాగైనా పరిష్కరించుకోవచ్చు. అందుకే ముందుగా ఆ పని చేసేందుకు గ్రేటర్ అధికారులు సిద్ధమవుతున్నారు.