వైసీపీలో అధినేత జగన్ రెడ్డి తప్ప.. తామంతా పోటుగాళ్లమేనని నిరూపించుకునేందుకు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతున్నారు. కానీ అసలు జగన్ రెడ్డి మాత్రం చర్చకు వస్తానని చెప్పడం లేదు. తాజాగా అంబటి రాంబాబు కూడా మీడియా ముందుకు వచ్చారు. జగన్ రెడ్డి ఎన్నికల సన్నాహాల్లో తీరిక లేకుండా ఉన్నారని అందుకే చర్చకు రారని.. ఆయన బదులుగా నేను వస్తానని చెప్పుకొచ్చారు.
టీడీపీ ఆఫీసులోనైనా తాను చర్చకు రెడీ అన్నారు. ఇలా జగన్ రెడ్డి ఎందుకు నేను వస్తానంటూ మట్లాడిన వాళ్లలో అంబటి రాంబాబు ఎన్నో లీడరో చెప్పడం కష్టం. కేశినేని నాని దగ్గర నుంచి చాలా మంది తాము వస్తామంటే తాము వస్తామన్నారు. కానీ జగన్ రెడ్డి వస్తారని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి జగన్ రెడ్డితో చర్చకు చంద్రబాబుకు అర్హత లేదని కవరింగ్ చేసుకున్నారు. జగన్ రెడ్డి చూసి కూడా చదవడానికి ఇబ్బంది పడతారు ఇక చర్చ అంటే ఆయన వల్ల కాదు.అందుకే ఒక్క సారి కూడా కనీసం మీడియా సమావేశం పెట్టలేకపోయారు.
ఢిల్లీలో పీవీకి భారత రత్న ప్రకటించారు కదా.. స్పందించమని జర్నలిస్టులు అడిగితే.. సాయిరెడ్డి విల్ ఆన్సర్ అంటూ.. వెళ్లిపోయారు జగన్ రెడ్డి. అంత చిన్న ప్రశ్నకు..ఆగి.. గొప్ప విషయం అని ఒక మాట చెప్పడానికి కూడా ఆయన తంటాలు పడ్డారు. అప్పుడు జగన్ రెడ్డి విల్ ఆన్సర్ అన్నట్లే.. ఇప్పుడు ఆయన తరపునతాము అంటూ.. చాలా మంది నేతలు ముందుకు వస్తున్నారు. దీనికి జగన్ రెడ్డి ఫీలవరు ఏమో ?