ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈవీఎంలు మొరాయించాయి. ఉదయమే ఓటు వేయడానికి వచ్చిన వారిలో చాలా మంది.. ఈవీఎంలు పని చేయని కారణంగా వెనక్కి వెళ్లారు. ఒకటి, రెండు చోట్ల మాత్రమే… ఇలా జరిగి ఉంటే.. పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదేమో…? కానీ.. దాదాపుగా 30 శాతం.. పోలింగ్ బూతుల్లో.. ఇలాంటి పరిస్థితి ఉందన్న ప్రచారం జరిగింది. దీని వెనుక ఎదైనా కుట్ర ఉందా..?
ఉదయం ఓటు కోసం వచ్చిన మహిళలను వెనక్కి వెళ్లిపోయేలా చేశారా..?
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు…. ఇటీవలి కాలంలో ఎక్కడా జరగనంత బ్లడీయెస్ట్గా ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిణామాలు ఉంటాయని.. చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎంతో కొంత ఉంటాయని.. అనుకున్నాం కానీ.. ఈ స్థాయిలో ఉంటాయని ఊహించలేకపోయాం. ఈవీఎంలలో …. కొన్ని ప్రాంతాల్లో సెలక్టివ్ గా .. కొన్ని ప్రాంతాల్లో మొరాయించాయి. కొన్ని ప్రాంతాల్లో సక్రమంగా పని చేశాయి. దీన్ని విశ్లేషించాల్సి ఉంది. ఓ రాజకీయ పార్టీ బలంగా ఉన్న చోటే… మాత్రమే.. ఈవీఎంలు మొరాయించాయో లేదో.. విశ్లేషించాలి. లెవల్ ఆఫ్ డిస్టర్బన్సెన్స్ ను అంచనా వేయాలి. వాటికి కారణం ఏమిటి..? అనేది తెలుసుకోవాలి. దీని వల్ల ఓటింగ్ కు అంతరాయం కలిగిందా లేదా.. తెలుసుకోవాలి. నార్మల్ గా ఉండాల్సిన స్థాయి కన్నా… తక్కువగా ఉంటే… తప్పనిసరిగా… ప్రయత్నం జరిగిందని చెప్పుకోవచ్చు. అంతరాయం జరిగినప్రాంతాల్లో రీ పోలింగ్ జరపొచ్చు. ఓ జిల్లాల్లో.. ఈవీఎంలు మొరాయించి.. మరో జిల్లాల్లో బాగుంటే… ఆలోచించాల్సి ఉంది. అలాగే… ఈవీఎంలు మొరాయించడం వల్ల మహిళా ఓటర్లు.. చాలా మంది వెనక్కి వెళ్లిపోయారన్న ప్రచారం ఉంది. దీన్ని కూడా.. ఎన్నికల సంఘం పరిశీలించాల్సి ఉంది. ఓవరాల్ పర్సంటేజీ బాగున్నప్పటికీ.. కొన్ని వర్గాలు.. ఎక్కువగా ఓటింగ్ కు దూరం అయితే.. కచ్చితంగా ఈసీ ఆలోచించాలి.
ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందనే అనుమానాలు ఎందుకొస్తున్నాయి…?
రాజకీయ పార్టీలు… కూడా… పోలింగ్ కు అంతరాయం కలిగించేటప్పుడు.. ఓ వర్గాన్ని భయపెట్టాలో కూడా.. ఓ అంచనాకు వస్తాయి. ఈ సారి ఏపీలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి, కానీ మామూలు ప్రాంతాల్లో మాత్రం అల్లర్లు జరిగాయి. మాకు సరైన… బలగాలు రాలేదని.. ఎన్నికలు జరగలేదంటున్నారు. ఎందుకు రాలేదో కూడా.. ఈసీ చెప్పాల్సి ఉంది. అవసరమైనన్ని బలగాలు పంపాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. మరి ఎందుకు పంపలేదు..? రాజకీయంగా సున్నితమైన ప్రాంతాలకు.. ఎందుకు బలగాలు పంపలేదు..?. సత్తెనపల్లి లాంటి నియోజకవర్గాల్లో గతంలో చాలా తక్కువ ఓట్లతోనే విజేత తేలారు. అలాంటప్పుడు… ఉద్రిక్తతలు ఉంటాయని తెలిసి కూడా… భద్రతా ఏర్పాటు చేయలేదు. ఈవీఎంలు పెట్టిన తర్వాత.. తీవ్రంగా.. గంటలు .. గంటలు ఈవీఎంలు మొరాయించిన పరిస్థితులు లేవు. అందుకే.. ఎన్నికల సంఘమే.. ఎన్ని ఈవీఎంలు మొరాయించాయి… ఎన్ని గంటలు మొరాయించాయి.. అన్న విషయాలను… స్పష్టం చేయాల్సి ఉంది. ఎంత సమయంలో.. ఓటింగ్ కు దూరం అయింది.. అన్న విషయాలను స్పష్టం చేయాల్సి ఉంది.
కడపలో స్మూత్… కృష్ణా జిల్లా ఆటంకాలు..! ఎందుకిలా..?
ఓ రాజకీయ పార్టీకి బలం ఉన్న చోటనే.. ఈవీఎంలు మొరాయిస్తే.. అది చాలా సీరియస్ విషయం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది.. ఎన్నికల సంఘమే. అందుకే… ఈవీఎంలపై… పూర్తి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎక్కడెక్కడ ఈవీఎంలు మొరాయించాయన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. కడపలో ఎక్కడా… ఈవీఎంలు మొరాయించలేదు. కానీ కృష్ణా జిల్లాలో మాత్రం తీవ్రంగా ఉంది. ఇదంతా.. ఓ పర్టిక్యులర్ ప్లేస్ లోనే ఈవీఎంలు ఎందుకు మొరాయించాయి… కొన్ని చోట్ల ఎందుకు బాగున్నయన్నదానిపై.. ఈసీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అనుమానలు తీర్చాల్సి ఉంటుంది. ఈవీఎంల మొరాయింపులతో ఫలితాలు తేడా వచ్చే అవకాశం ఉంది. చాలా తక్కువ మార్జిన్ తో.. ఫలితం తేలే చోట.. ఈవీఎంల వల్ల ఓట్లు వేయలేకపోయిన వారి వల్ల ఫలితం మారిపోతుంది. ఏపీలో ప్రతిపక్ష పార్టీకి సహకరించడానికే.. ఇలాంటివి జరిగాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి కాబట్టి… ఈ విషయంపై ఎన్నికల సంఘం… స్పష్టత ఇవ్వాల్సి ఉంది.