శేఖర్ కమ్ముల సినిమా అంటే సంగీతానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. తన ఆల్బమ్ లోని ప్రతీ పాటనీ… ఓ కొత్త కోణంలో చూపించాలనుకుంటాడాయన. ఒక్కో పాటా ఒక్కో తీరుగా ఉంటుంది. ఈమధ్య విడుదలైన… `సారంగ దరియా` పాట.. ఓ ఊపు ఊపేసింది. యూ ట్యూబ్ లో ఆ పాట సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరో పాట బయటకు వచ్చింది. అదే.. ఏవో ఏవో కలలే. మెలోడీ బీట్ తో మొదలై.. ఫాస్ట్ బీట్ లోకి మళ్లి.. ఓ ప్రవాహంలా సాగిన గీతమిది. పవన్ సంగీతం అందించారు. భాస్కర భట్ల రవికుమార్ సాహిత్యం సమకూర్చారు. `సారంగ దరియా`లా వినగానే ఎక్కేసే బీట్ అయితే కాదు. వినగా వినగా నచ్చుతుందేమో..? ఇక సాయి పల్లవి డాన్స్ కూడా కలిస్తే – థియేటర్లో ఈ పాట ఓ ఊపు ఊపొచ్చు. జోనితా గాంధీ. నకుల్ అభయన్కర్… ఈ పాటని ఆలపించారు. `లవ్ స్టోరీ` ఆల్బమ్ లోని మిగిలిన పాటలతో పోలిస్తే… ఈ పాట కొత్త తరహాలో ఉంది. మిగిలిన పాటలతో శేఖర్ కమ్ముల ఇంకెలాంటి మ్యాజిక్ చేస్తాడో?