సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతానికి సస్పెన్షన్ లో ఉన్న ఆయన విధుల్లో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని తన ఖాతాలో వేసుకున్నారు . ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశించింది. కేసులు కూడా పెట్టింది. ఈ క్రమంలో తనను అరెస్టు చేస్తారన్న భయంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు. ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.
సంజయ్ తన సర్వీసులో జగన్ రెడ్డి కోసం చేయకూడనన్ని తప్పులు చేశారు. దేవుడి పాటలు పాడుకుంటూ.. సువార్త కూటముల్లో కనిపించే ఆయన ఎప్పుడూ కీలకమైన పోస్టింగుల్లో లేరు. అయితే సునీల్ కుమార్ ఏపీసీఐడీ చీఫ్ గా తొలగించిన తర్వాత సంజయ్ కు చాన్స్ ఇచ్చారు. అంతకు ముందు ఆయనపై కొన్ని అభియోగాలు ఉండటంతో వాటిని ఆసరాగా చేసుకుని ఆయనతో తప్పుడు పనులన్నీ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్, సజ్జల మెప్పు కోసం ఆయన రెచ్చిపోయారు. మార్గదర్శి, చంద్రబాబుపై కేసుల్లో ఆయన చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా ఇతర చోట్లా ప్రెస్మీట్లు పెట్టారు. అన్నింటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.
అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు.కానీ ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి డబ్బులు దోచేసినట్లుగా ఆధారాలు లభించడంతో ఆ కేసుల్లో మాత్రం చర్యలు తీసుకుంటున్నారు. ముందస్దు బెయిల్ ఇవ్వడంతో అరెస్టు నుంచి తప్పించుకున్నారు. జత్వానీ సహా పలు కేసుల్లో ఐపీఎస్లు క్రిమినల్ నేరాలకు పాల్పడినప్పటికీ ప్రభుత్వం వారికి న్యాయపరమైన అవకాశాలు కల్పించింది. ఈ కారణంగా ఎవర్నీ అరెస్టు చేయలేదు.