మూడు రోజుల కిందట ప్రజా భవన్ ఎందట ఓ కారు ఓవర్ స్పీడ్ తో వచ్చి బారీకేడ్లను ఢీకొట్టింది. అందులో ఉన్న ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు. ఆ కారు బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే షకీల్ది. కేసు పెట్టింది. ఆయన డ్రైవర్ పైనే. అంతా సవ్యంగా ఉందని అనుకున్నారేమో కానీ.. అసలు కథ మాత్రం వేగంగానే బయటకు వచ్చింది. అదేమిటంటే ఆ కారులో ముగ్గురు అమ్మాయిలు సహా మిత్రులతో జల్సా చేస్తూ డ్రైవింగ్ చేశాడు షకీల్ కొడుకు. ప్రమాదం జరగడంతో పోలీసులు తీసుకెళ్లారు. కుమారుడి గురించి తెలిసిన వెంటనే తన పనివాడ్ని తీసుకుని షకీల్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చాడు.
డ్రైవింగ్ చేసి తన పనోడేనని వాడి పేరు రాసుకోమని చెప్పి తన కొడుకుని తీసుకెళ్లిపోయాడు. అచ్చంగా సినిమాల్లోలా జరిగిపోయింది. పోలీసులు కూడా.. మాజీ ఎమ్మెల్యే సాబ్ చెప్పాడని అదే రాసుకున్నారు. కానీ తర్వాత గుట్టు బయటకు వచ్చింది. దీంతో సీపీ ఆరా తీశారు. చివరికి లెక్క బయటకు వచ్చింది. పంజాగుట్ట సీసీ కెమెరాల ఫుటేజీ చూస్తే సినిమా కనిపించింది. వెంటనే షకీల్ కొడుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట ఇన్స్ పెక్టర్ బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరిపోయారు. ఈ వ్యవహారంలో నిందితుడ్ని తప్పించిన పోలీసులు అందరిపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ సర్కారులో అధికార మదంతో ఎంతో మంది ఇలాంటి తప్పులు చేసి తప్పించుకున్నారు. షకీల్ కుమారుడి జల్సా డ్రైవింగ్ వల్ల గతంలో ఓ చిన్న పిల్లాడు కూడా చనిపోయాడు. అప్పుడూ కూడా ఇలాగే తప్పించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఓ సారి గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై నుంచి అతి వేగంగా కారు పోనిచ్చి ప్రమాదానికి గురైన కేసీఆర్ బంధువు ఒకరు.. పక్కనే ఉన్న ఆస్పత్రిలో చేరి బెయిల్ వచ్చే వరకూ ట్రీట్ మెంట్ పొంది తప్పించుకున్నారు. ఈ ప్రమాదం వల్ల రెండు కుటుంబాలు అనాథలయ్యాయి. ఇప్పుడు అలాంటి అన్యాయాలకు పోలీసులు చెక్ పెట్టే సందర్భం వచ్చినట్లుగా కనిపిస్తోంది