హైదరాబాద్: రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మహారాష్ట్ర మహిళామంత్రి పంకజ ముండేతో పోల్చారు. మహిళా, శిశు సంక్షేమ మంత్రిగా ఉన్న పంకజ ఇటీవల రు.200 కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. పంకజ తన మంత్రిత్వశాఖలో కాంట్రాక్టులను ఇష్టమొచ్చినట్లు కేటాయించి అవినీతికి పాల్పడినట్లే బుచ్చయ్య చౌదరి గోదావరి పుష్కరాల పనులలో కాంట్రాక్టులను తన ఇష్టమొచ్చిన వారికి కేటాయిస్తున్నారని హర్షకుమార్ ఆరోపించారు. రాజమండ్రిలో క్రైస్తవులకు తక్షణమే శ్మశానవాటిక నిర్మించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 10లోపు దీనిపై ప్రకటన చేయాలని, లేకపోతే ఆమరణ దీక్ష చేపడతానని అల్టిమేటమ్ ఇచ్చారు. రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కిరణ్కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపాయారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు.