సీఎం డౌన్, డౌన్ అన్నందుకు.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఓ మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేశారు. ఇలా అరెస్టయినది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ. నిజానికి ఆయన సీఎం పాల్గొన్న కార్యక్రమంలో ఈ నిరసనలు వ్యక్తం చేయలేదు. ఓ ప్రభుత్వ భవనానికి వైసీపీ రంగులు వేస్తూండగా.. గ్రామస్తులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో .. చేసిన నినాదాల కారణంగా.. పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఓ వైసీపీ నేత నుంచి ఫిర్యాదు తీసుకోవడం.. ఆయనను ఇంటికి వెళ్లి మరీ అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. అరెస్ట్ చేసిన వారిలో వెంకటరమణ కుమారుడు కూడా ఉన్నారు. వారితో పాటు మరో పదిహేడు మందిని కూడా అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భవనాలన్నింటికీ.. వందల కోట్లు ఖర్చు పెట్టి… వైసీపీ రంగులు వేసేస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలా.. పాతపట్నంలోనూ.. ఓ గ్రామంలో నిరసన వ్యక్తమయింది. అయితే అక్కడ నిరసనలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పాల్గొనడం.. ఈ విషయం.. పై స్థాయికి తెలియడంతో.. వెంటనే.. కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలనే ఆదేశాలు.. కింది స్థాయి అధికారులకు అందాయి. అసలు అది కేసో కాదో.. అంచనా వేయలేని పరిస్థితుల్లో పోలీసులు .. .మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి… తీసుకెళ్లిపోయారు.
నిజానికి కలమట వెంకటరమణ వైసీపీ ఎమ్మెల్యేనే. 2014 లో వైసీపీ తరపున గెలిచి.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. వైసీపీని వీడినందుకు ఆయనకు.. అలా చేయాలనుకున్నారేమో.. కానీ.. చిన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందకూ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అన్నందుకే.. అరెస్ట్ చేస్తారా.. అన్న చర్చ ఇప్పుడు ప్రారంభమయింది. టీడీపీ నేత వర్ల రామయ్య.. ఇదే అంశంపై… ఏపీ సీఎంకు సవాల్ చేశారు. ఆయనపై ఉన్న కేసులు.. టీడీపీ నేతలపై… కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన కేసులపై చర్చించేందుకు రావాలని సవాల్ చేశారు.