సీనియర్ రాజకీయ వేత్త జైపాల్ రెడ్డి కన్నుమూశారు. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతూ.. రాత్రి ఒకటిన్నర సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన నిమోనియాతో బాధపడుతున్నారని.. కుటుంబసభ్యులు చెబుతున్నారు. 77 ఏళ్ల జైపాల్ రెడ్డి… దేశ రాజకీయాల్లో ప్రభావిత పాత్ర పోషించారు. రాష్ట్ర రాజకీయాల్లో కన్నా.. ఆయన ఎక్కువగా దేశ రాజకీయాల్లోనే కీలకంగా వ్యవహరించారు.
ఉమ్మడి హబూబ్నగర్జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించిన జైపాల్ రెడ్డి… ఉన్నత విద్యావంతుడు. ఆయనకు విషయ పరిజ్ఞానం ఎక్కువ. మొదటి సారిగా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1969 మరియు 1984 మధ్య నాలుగు సార్లు కాంగ్రెస్ తరపున అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. 1984లో మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుంచి మొదటి సారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ వ్యతిరేకించి 1977లో జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత పరిణామాల్లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా 1999, 2004లలో విజయం సాధించారు. 1990, 1996లలో రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు.
యూపీఏ హయాంలో.. ఆయన కేంద్రమంత్రిగా పని చేశారు. అలాగే.. గతంలో.. ఐకే గుజ్రాల్ కేబినెట్లో కూడా పని చేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి.