తొమ్మిది రోజులపాటు కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించాయి..సభలో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ రగడ సృష్టించినా వారిని సస్పెండ్ చేయకుండా సభను హుందాగా కొనసాగించారు.. కానీ, అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ఎమ్మెల్యే దానం నాగేందర్ నోరు జారడంతో ఇన్ని రోజులు సభ నిర్వహణ అద్భుతంగా కొనసాగించిన కాంగ్రెస్…చివరికి అప్రతిష్ట మూటకట్టుకోవాల్సి వచ్చింది.
హైడ్రాపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతుంటే బీఆర్ఎస్ సభ్యులు అడ్డు తగలడంతో దానం ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అరేయ్ మిమ్మల్ని బయట తిరగకుండా చేస్తా.. తోలు తీస్తా..నీ…అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నిజంగా ఈ తరహా బెదిరింపులు, వ్యాఖ్యలు ఏమాత్రం మంచివి కావు..ఈ క్రమంలోనే సభలో తీవ్ర దుమారం రేగడం ఆ తర్వాత దానం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమే.
Also Read : కేటీఆర్ అభాసుపాలు!
అయితే, గతంలో కన్నా ఈసారి అసెంబ్లీ ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రతిబింబిస్తుంది అన్న ఖ్యాతిని మూటగట్టుకుంటున్న వేళ దానం వ్యాఖ్యలు కాంగ్రెస్ ను వెనక్కి లాగేవే. ఇన్ని రోజులు సభ నిర్వహణతో గొప్ప పరిణితి కనబరిచిన కాంగ్రెస్…ఫిరాయింపు ఎమ్మెల్యే కామెంట్స్ తో ఇరుకున పడినట్లు అయింది. అయినప్పటికీ దానం ఏమాత్రం బేషజాలకు వెళ్ళకుండా అసెంబ్లీ సాక్షిగా క్షమాపణలు చెప్పి సభ గౌరవాన్ని చాటి చెప్పినట్లు అయింది.