సీనియర్ నటుడు రాజశేఖర్ చేతికో క్రేజీ ప్రాజెక్ట్ అందిందని తెలుస్తోంది. అమేజాన్ ప్రైమ్ తో ఓ మంచి డీల్ కుదిరిందని ఇన్ సైడ్ వర్గాల టాక్. అమేజాన్ లో రాజశేఖర్ ఓ సినిమా చేయబోతున్నారట. కథ ఇప్పటికే సిద్ధమైంది. ఎడిటర్ గా మంచి అనుభవాన్ని సంపాదించిన గ్యారీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇది ఆయనకు రెండో సినిమా. నిఖిల్ తో ‘స్పై’ తెరకెక్కించారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఇప్పుడు రాజశేఖర్ కోసం ఓ కథ రాసుకొని, అమేజాన్ దగ్గరకు వెళ్లారు. అమేజాన్కు ఈ కథ బాగా నచ్చి, ప్రాజెక్ట్ ఓకే చేసింది. ఈ సినిమా కోసం దాదాపు రూ.60 నుంచి రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో రాజశేఖర్ తో పాటుగా ఇద్దరు యంగ్ హీరోలు కనిపించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇటీవల నితిన్ కథానాయకుడిగా నటించిన ‘ఎక్ట్స్రా’లో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఓ భారీ క్రేజీ చిత్రంలో రాజశేఖర్ కు విలన్ పాత్ర దక్కినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.