పవన్ కల్యాణ్ ఖాతాలో మరో సినిమా చేరింది. ఈసారి అట్లీతో ఆయన జట్టు కట్టబోతున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ ఉందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. 2024 ఏపీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు పవన్. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే జెట్ స్పీడ్ వేగంతో సినిమాలు పూర్తి చేయాలని భావిస్తున్నాడు. పవన్ చేతిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’ ఉన్నాయి. వీటిలో ముందుగా ‘ఓజీ’ పూర్తవుతుంది. ఆ తరవాత ‘ఉస్తాద్.. భగత్ సింగ్’. ఆ తరవాత ‘హరి హర వీరమల్లు’కి డేట్లు ఇస్తాడు. ఇవన్నీ పూర్తయిన తరవాత పవన్ – అట్లీ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ తో పాటు మరో నిర్మాత కూడా భాగస్వామిగా ఉంటారని టాక్. అల్లు అర్జున్ తో అట్లీ ఓ సినిమా చేయాలి. ఎన్టీఆర్ తో కూడా టాక్స్ నడుస్తున్నాయి. వాటితో పాటుగా పవన్ కల్యాణ్ నీ ఫిక్స్ చేసుకొన్నాడు. బహుశా.. బన్నీ సినిమా పూర్తయ్యాకే పవన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ఛాన్సుంది. ఒకవేళ బన్నీ – త్రివిక్రమ్ సినిమా ముందుగా పట్టాలెక్కితే, అప్పుడు పవన్ – అట్లీ కాంబో ముందు వరుసలోకి వస్తుంది. ఇదీ.. పవన్ ప్లానింగ్.