ఎక్స్‌క్లూజీవ్: బ్రాహ్మ‌ణుడిగా ప్ర‌భాస్‌

ప్ర‌భాస్ – హ‌నురాఘ‌వ‌పూడి కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ పాత్ర ఏమిట‌న్న‌పై ఇప్ప‌టికీ క్లారిటీ రాలేదు. ఆయ‌న బ్రిటీష్ సైనికుడిగా క‌నిపించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ పై ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. ఇందులో ప్ర‌భాస్ బ్రాహ్మ‌ణ యువ‌కుడిగా నటించ‌నున్నాడు. ఓ పూజారి త‌న‌యుడిగా ప్ర‌భాస్ పాత్ర‌ని ఈ సినిమాలో ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. ఈ త‌ర‌హా పాత్ర పోషించ‌డం ప్ర‌భాస్ కు పూర్తిగా కొత్త‌. ‘అదుర్స్‌’, ‘డీజే’ సినిమాల్లో హీరోల్ని బ్రాహ్మ‌ణులుగానే చూపించారు. అయితే అందులో ఫ‌న్ ఎలిమెంట్ ఎక్కువ‌. హ‌ను త‌న హీరోల క్యారెక్ట‌ర్లు డిజైన్ చేసుకొనే ప‌ద్ధ‌తి వేరు. ఈ పాత్ర‌లో సీరియ‌స్‌నెస్ ఉంటుంది.

Also Read : హాట్ టాపిక్‌: ప్ర‌భాస్ పారితోషికం త‌గ్గించుకొన్నాడా?

స్వాతంత్య్రం రాక‌ముందు జ‌రిగిన కథ ఇది. అప్ప‌టి భార‌త‌పోరాటాన్ని తెర‌పై చూసే అవ‌కాశం ఉంది. దానికి తోడు హ‌ను సినిమాలంటే ప్రేమక‌థ‌ల‌కు స్కోప్ ఎక్కువ‌. హీరోయిన్ పాత్ర‌ల్ని అందంగా, అర్థ‌వంతంగా తీర్చిదిద్దుతారాయ‌న‌. ఈ సినిమాలో క‌థానాయిక పాత్ర‌కూ అంతే ప్రాధాన్యం ఉంద‌ని స‌మాచారం. ఆ పాత్ర‌లో ఎవ‌రు క‌నిపిస్తారో అన్న ఆసక్తి నెల‌కొంది. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ క‌థానాయిక‌గా ఎంపిక‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. కానీ… చిత్ర‌బృందం ఇంకా బెట‌ర్ ఆప్ష‌న్ కోసం అన్వేషిస్తోంది. త్వ‌ర‌లోనే క‌థానాయిక ఎవ‌రో తెలిసిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close