బ్యాంకులకు టోకరా కొట్టి, కోట్లకు కోట్లు రుణాలు ఎగ్గొట్టిన ఘరానా మోసగాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి పెద్ద పెద్ద తలకాయల్లో విజయ్ మాల్యా ఒకడు. బ్యాంకు రుణాలు… అనగానే గుర్తొచ్చే పేర్లలో విజయ్ మాల్యా మొదటి వరుసలో ఉంటుంది. విజయ్ మాల్యాలా బ్యాంకుల్ని దర్జాగా లూఠీ చేసిన వైట్ కాలర్ నేరగాళ్ల నేపథ్యంలో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది? మహేష్ బాబు సినిమా ఇదే పాయింట్‌తో నడవబోతోందని సమాచారం.
మహేష్ బాబు – పరశురామ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమా కథ… ఇలా బ్యాంకులకు టోకరా వేసిన మోసగాళ్ల నేపథ్యంలో సాగుతుందని సమాచారం. దాంట్లో ఓ అంమైన లవ్ స్టోరీ మేళవించి, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, మహేష్ బాబు ఇమేజ్‌కి తగ్గట్టుగా తీర్చిదిద్దబోతున్నాడు పరశురామ్. త్వరలోనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. షూటింగ్ మాత్రం ఆగస్టులో ఉంటుంది. 2020 చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.