అప్పుడెప్పుడో… 2012 అనే ఓ హాలీవుడ్ సినిమా వచ్చింది. యుగాంతానికి సంబంధించిన ఫిక్షనల్ స్టోరీ అది. ఈ ప్రపంచం అంతమైపోతే.. ఎలా ఉంటుంది? అసలు ఏమవుతుంది? అనే పాయింట్ తో నడిచిన కథ. అప్పట్లో యుగాంతం గురించి కూడా మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. వాటి స్ఫూర్తితో రాసుకొన్న కథ అది. అయితే ఆ తరవాత ఎవరూ యుగాంతం కథ ని ముట్టుకోలేదు.
అయితే ప్రాజెక్ట్ కె కథ యుగాంతానికి సంబంధించిందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా టైమ్ ట్రావెల్ చుట్టూ తిరుగుతుందని ఇది వరకు ఊహాగానాలు వచ్చాయి. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది. సో.. యుగాంతం విషయంలో ఎంత వరకూ నిజం ఉందో.. తెలియాలంటే టీమ్‌లో ఎవరో ఒకరు నోరు విప్పాలి. ప్రాజెక్ట్ కె లో `కె` అంటే కల్కి. కలియుగం కల్కి అవతారంతోనే అంతం అవుతుంది. ప్రభాస్ పాత్ర కల్కిని పోలి ఉంటుంది. అయితే.. పురాణాల టచ్ ఎక్కడా ఉండదు. అండర్ కరెంట్‌లో ఆ పాత్రలు తెరపై కనిపిస్తాయి అంతే. పాత్రలూ, వాటికి పెట్టిన పేర్లు.. సందర్భాలూ అన్నీ.. పురాణాలతో అనుసంధానంగా ఉండబోతున్నాయి. అయితే ఎక్కడా నేరుగా వాటి ప్రస్తావన ఉండదు. అలా.. ఈ కథని నాగ అశ్విన్ డిజైన్ చేసుకొన్నాడని తెలుస్తోంది.