హుజురాబాద్‌లో గెలుపెవరిది అంటూ వచ్చే ఊహాగానలకు ఇక చెక్ పడింది. అలాంటి ఊహాగానాలతో సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన దిశానిర్దేశం చేసింది.ఏ ఎన్నికలు జరిగినా ఏదో ఓ పేరుతో గెలుపెవరిది అని ఫలితాలు ప్రకటించడం కామన్‌గా వస్తూంటుంది. ఎక్కువగా.. నిఖార్సుగా చేసే సర్వేలు తక్కువే. కానీ ఊహాగానాలు మాత్రం కుప్పలు తెప్పలుగా వస్తూ ఉంటాయి.
ఎక్కువగా ఎవరి పార్టీ అభిమానం ప్రకారం.. ఆ పార్టీ కి దగ్గరైన జర్నలిస్టులు.. ఇతరులు వీటిని చేస్తూ ఉంటారు. అయితే హుజురాబాద్ విషయంలో మాత్రం ఇంత వరకూ ఇలాటి సర్వేలు రాలేదు. ఇక ముందు రావడానికికూడా అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది. గతంలో నాగార్జున సాగర్ ఎన్నికల సమయంలోనే పోలింగ్‌కు రెండు, మూడురోజుల ముందు కూడా కొన్ని సంస్థలు సర్వేలు ప్రకటించాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.
ఇప్పుడు హుజురాబాద్‌లో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి కూడా అవకాశం లేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రకటించకూడదు. నేరుగా ఫలితాలను మాత్రమే ప్రకటించాల్సి ఉంటుది. కొత్తగా ఈ నిబంధనలు ఎందుకు అన్న విషయం పక్కన పెడితే.. ఈ సారి ఓటర్లకు పెద్ద న్యూసెన్స్ తప్పినట్లుగా అనుకోవచ్చు. ఒక్క హుజురాబాద్‌కే కాకుండా అన్ని రకాల ఎన్నికలకు ఈ నిబంధన అమలు చేయాలనేది ఎక్కువ మంది కోరుకునే మాట .