గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. చిరుతో కలిసి ఆయన స్టెప్పులు కూడా వేశాడు. సల్మాన్ రాక… ఈ కథకు పెద్దగా కలసి రాలేదు కానీ, ఇద్దరు సూపర్ స్టార్లని ఒకేసారి తెరపై చూసేసరికి.. కాస్త జోష్ వచ్చింది. ఈ సినిమాకి గానూ సల్మాన్ ఎలాంటి పారితోషికమూ తీసుకోలేదు. ఈ విషయాన్ని చిరంజీవి గతంలోనే చెప్పారు. పారితోషికం ప్రస్తావన తెచ్చినా – సల్మాన్ కోపగించుకొన్నాడని సెలవిచ్చారు. అయితే ఇప్పుడు సినిమా విడుదల అయిపోయిది. చిత్రబృందం లాబాల బాట పట్టింది. ఇప్పుడు సల్మాన్‌కి కూడా ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేద్దామన్న నిర్ణయానికి వచ్చారు చిరంజీవి. ఈ విషయాన్ని గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లోనే చూచాయిగా చెప్పేశారు చిరు. ఇప్పుడు చరణ్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడట. సల్మాన్‌కి క్యాష్రూపంలో కాకుండా ఓ ఖరీదైన బహుమతి ఇవ్వాలని చరణ్ భావిస్తున్నాడు. ఓ కాస్ల్టీ కారుని సల్మాన్‌కి బహుమతిగా పంపితే ఎలా ఉంటుందన్నచర్చ జరుగుతోంది. ఈవారంలోనే చరణ్ ముంబై వెళ్తాడని, అక్కడ సల్మాన్ ఖాన్ ని మర్యాదపూర్వకంగా కలుస్తారని, ఈ సందర్భంగానే.. సల్మాన్ కి ఇవ్వాల్సింది ముట్టజెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.