పోలవరం… ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రిక. ఈ ప్రాజెక్టును ఎలాగైనా ఈ టర్మ్ లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటగా పోలవరం వెళ్లి అక్కడ జరుగుతోన్న పనులను పరిశీలించి నిర్ఘాంతపోయారు. వైసీపీ హయాంలో ప్రాజెక్టు పూర్తి చేయాడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని గుర్తించి పోలవరం విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఇంకెంత సమయం పడుతుంది..? ఎంత ఖర్చు అవుతుంది..? అనే అంశాలపై ఎక్స్ పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేశారు. నిపుణుల బృందం ఈ నెల 29న పోలవరం ప్రాజెక్టును సందర్శించనుంది. ఈ బృందంలో ఇద్దరు అమెరికా, మరో ఇద్దరు కెనడాకు చెందిన ఇంజనీర్లు ఉండనున్నారు. వారం రోజులపాటు రాష్రంలో ఉండి ప్రాజెక్టు పరిస్థితులను ఎక్స్ పర్ట్స్ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించనుంది.
అలాగే, ప్రతి మూడు నెలలకు ఓసారి రాష్ట్రంలో పర్యటించి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కీలక సూచనలు చేయనుంది. శనివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి డయా ఫ్రమ్ వాల్ ను నిపుణుల బృందం పరిశీలించనుంది. దానికి మరమ్మతులు చేయలా.? లేక కొత్త డయా ఫ్రమ్ వాల్ ను నిర్మించాలా..? అనే విషయంలో ప్రభుత్వానికి సూచనలు చేయనుంది.
పోలవరం విషయంలో చంద్రబాబు స్పెషల్ కేర్ తీసుకుంటుండంతో ఇక నుంచి ప్రాజెక్టు పనులు యుద్దప్రాతిపదికన కొనసాగనున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే అసాధ్యం అనుకున్న పోలవరం ప్రాజెక్టు ఈ ఐదేళ్లలోనే పూర్తయ్యే అవకాశం ఉంది.