2015లో మళ్లి మళ్లి ఇది రాని రోజు సినిమాతో సక్సెస్ అందుకున్న శర్వానంద్ ఈసారి ఎక్స్ రాజాగా ప్రేక్షకులముందుకు వస్తున్నాడు. ఈ నెల 14న వస్తున్న ఎక్స్ ప్రెస్ రాజా సినిమాకు ఇప్పటికే సెన్సార్ సభ్యుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మొదటి సినిమానే సూపర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి హిట్ అందుకున్న మేర్లపాక గాంధి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
యు.వి క్రియేషన్స్ బాయనర్లో నిర్మించబడ్డ ఈ సినిమాలో సురభి హీరోయిన్ గా చేసింది. అయితే సినిమా విడుదలకుముందే శాటిలైట్ రైట్స్ అదరిపోయే ఫ్యాన్సీ రేటుకి లీడింగ్ ఛానెల్ మా టివి దక్కించుకుందట. సినిమా విడుదలకు ముందే వచ్చిన క్రేజ్ దృష్ట్యా కచ్చితంగావిజయం సాధిస్తుందని నమ్మకంతో 3.25 కోట్ల రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కొనేసిందట మాటివి.
ప్రవీన్ లక్కరాజు సంగీతం అందించిన ఈ సినిమా వదిలిన ట్రైలర్స్, పోస్టర్స్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి.. ఎంటర్టైన్మెంట్ ప్రధాన అంశంగా వస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో వస్తున్న పెద్ద సినిమాల ప్రభావాన్ని తట్టుకుని మంచి హిట్ సినిమాగా నిలవాలని ఆశిద్దాం.