F2.. సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ సినిమాలో భారీ తారాగణం ఉన్నా… అందరికీ మంచి పేరు వచ్చింది.చిన్న పాత్ర చేసినవాళ్లూ గుర్తిండిపోయారు. అంతెందుకు.. `అంతేనా.. అంతేనా` అనే ఒకే ఒక్క డైలాగులోనూ ఆ నటుడు పాపులర్ అయిపోయాడు. ఎఫ్ 3లో వీళ్లంతా కంటిన్యూ అయ్యారు. కొన్ని కొత్త పాత్రలు ప్రవేశించాయి కూడా. వాళ్లలో… సునీల్, సోనాల్ చౌహాన్. ఈ ఫ్రాంచైజీలో వీళ్లకు చోటు దక్కడం అదృష్టమైతే… మంచి పాత్రలకు పడడం మరింత లక్కీ. ఈ విషయాన్ని వాళ్లే చెబుతున్నారు. ఎఫ్ 3 కంటే అందరికంటే ఎక్కువగా కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు.
“ఈ సినిమాలో వింటేజ్ సునీల్‌ని చూస్తారు. నా ఎటకారం, బాడీ లాంగ్వేజ్. పూర్తిగా మారిపోయాయి. ఇలా నన్ను చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. అనిల్ రావిపూడి కూడా నా పాత్రని అలానే తీర్చిదిద్దాడు. ఈ సినిమాని చూడ్డానికి రిపీట్ ఆడియన్స్ వస్తారు. నాది గ్యారెంటీ“ అని నమ్మకంగా చెబుతున్నాడు సునీల్. సోనాల్ దీ అదే మాట. అసలు ఎఫ్ 3 ట్రైలర్లో సోనాల్ కనిపించనే లేదు. ఆ విషయంలో సోనాల్ కి ఎలాంటి బెంగా లేదట. “ఎఫ్ 3 ట్రైలర్ లో నేను లేను. దానికి ఓ కారణం ఉంది. ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రనాది. నా ఎంట్రీ తోనే ఓ ట్విస్ట్ ఓపెన్ అవుతుంది. అందుకే నా పాత్రని దాచారు. ఈ సినిమా నాకో గేమ్ ఛేంజర్“ అనేసింది… సోనాల్. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. వారిద్దరూ ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచేసినట్టు ప్రచార చిత్రాలే చెబుతున్నారు. నిజానికి.. సోనాల్ అంతకంటే హాట్ గా కనిపించబోతోందట. అందుకే సోనాల్ ఈ సినిమాపై అన్ని నమ్మకాలు పెంచుకుందని టాక్.