తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫేస్బుక్ నిషేధం వించింది. ఆయన జాతి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నకారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఫేస్ బుక్ ప్రకటించింది. కొద్ది రోజుల కిందట.. అంతర్జాతీయ పత్రిక అయిన వాల్ స్ట్రీట్ జర్నల్ భారత్‌లో ఫేస్బుక్… తన అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధంగా… భారతీయ జనతా పార్టీ నేతల హేట్ స్పీచ్‌లు వైరల్ అయ్యేలా చేస్తోందని.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని… కథనం ప్రచురించింది. దానికి కారణం బీజేపీ అంటే ఫేస్బుక్ భయడటమే కారణం అని వాల్ స్ట్రీట్ జర్నల్ విశ్లేషించింది. ఆ కథనంలో ఎక్కువగా రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు.. ఫేస్ బుక్ పోస్టులనే ఉదాహరణగా చూపించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంతో.. జాతీయంగా దుమారం రేగింది.
సోషల్ మీడియాను అధికారంతో బెదిరించి.. ప్రజల మధ్య విద్వేషాలు పెట్టి రాజకీయ లాభం పొందుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దానికి వాల్ స్ట్రీట్ జర్నల్ కథనమే నిదర్శమని చెప్పడం ప్రారంభించారు. రాహుల్ గాంధీ కూడా.. అవే విమర్శలు చేశారు. అదే సమయంలో…పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న శశిధరూర్.. విచారణ కోసం.. ఫేస్‌బుక్‌కు నోటీసులు జారీ చశారు. ఫేస్బుక్ కూడా.. ఈ ఆరోపణల్ని ఖండించింది. విద్వేష ప్రసంగాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రమాణాలు అనుసరిస్తున్నామో.. ఇండియాలో కూడా అంతే వ్యవహరిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు మాత్రం రాజాసింగ్‌పై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రకటించింది.
ఎమ్మెల్యే రాజాసింగ్ సహజంగానే కరుడు గట్టిన హిందూత్వ వాది. ఆయన ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే హిందూత్వ వాదం అనుకుంటారు. దానికి తగ్గట్లుగానే ఆయన సోషల్ మీడియా పోస్టులు ఉండేవి. ఇప్పుడు వివాదం అయ్యే సరికి.. తనకు ఫేస్ బుక్ ఖాతా లేదని… తన ఖాతా మూడేళ్ల కిందట హ్యాక్ అయిందని… చెబుతున్నారు. తన పేరుపై ఇతరులు ఖాతా నిర్వహిస్తున్నారని ఆయనంటున్నారు.