ఆవిర్భావం నుంచి అప్రతిహతంగా ఎదుగుతూ వచ్చిన ఫేస్ బుక్ ఇప్పుడు విశ్వసనీయత చిక్కుల్లో పడింది. యూజర్ల ఆలోచనలు మార్చడంలో సోషల్ మీడియాది కీలక పాత్ర. ఇప్పుడు.. ఈ ఫేస్బుక్ కొంత మందికి ఫేవర్‌గా వ్యవహరిస్తూ… రాజకీయాలను మార్చేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇండియాలో బీజేపీకి అనుకూలంగా ఎలా వ్యవహరించిందో చెబుతూ.. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం రాయడంతో కలకలం రేగింది. నిజానికి వాల్ స్ట్రీట్ జర్నల్ రాయక ముందే… ఫేస్బుక్లో బీజేపీ ఆధిపత్యం ఎలా ఉంటుందో… యూజర్లకు తెలుసు. వారి భావజాలం ఎంత వేగంగా ప్రజల్లో వ్యాప్తి చెందిందో… సులువుగానే అంచనా వేయవచ్చు. కేవలం అంది.. ఫేస్‌బుక్‌పై వారు చూపించిన ప్రత్యేక శ్రద్ధ కారణం అని అనుకోవచ్చు.
గతంలో వివిధ సందర్భాల్లో కేంద్ర మంత్రులు … ఫేస్‌బుక్‌కు.., వాట్సాప్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలు నిషేధిస్తామన్నంత స్థాయిలో ఉండేవి. ఓ సందర్భంలో అలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అవి చాలు… ఆయా సంస్థలను.. కట్టడి చేయడాకన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తర్వాత ఆయా సంస్థలపై ఎలాంటి హెచ్చరికలు రాలేదు… ఆయా సంస్థలు కూడా.. బీజేపీ కంటెంట్‌కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఆ విషయం వాల్‌స్ట్రీట్ జర్నల్ చెప్పిన తర్వాత చర్చనీయాంశం అయింది కానీ.. చాలా మందికి ముందుగానే తెలుసు. ఫేస్బుక్ పాలసీలకు వ్యతిరేకంగా…బీజేపీ హేట్ స్పీచ్లన్నింటినీ వైరల్ చేయడానికి సహకరించిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ అంశంపై ఫేస్‌బుక్‌పై వివాదం ఇప్పట్లో ఆగే అవకాశం లేదు. తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫేస్బుక్ పాలసీ డైరక్టర్ మీడియాకు ఎక్కడంతో పరిస్థితి మారిపోయింది. ఫేస్బుక్ యాజమాన్యాన్ని పిలిచి ప్రశ్నిస్తామని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ ప్రకటించారు. భారత్‌లో హింసను ప్రేరేపించే పోస్టుల విషయంలో ఫేస్బుక్ ఉదాసీనతను ప్రశ్నిస్తామనీ… సమగ్ర వివరణ కోరతామని శశిథరూర్ ట్వీట్ చేశారు. ఫేస్ బుక్ శైలి ఇప్పుడు భారత్‌లో మాత్రమే చర్చనీయాంశం కావడం లేదు. తమ తమ దేశాల్లో రాజకీయ ఆసక్తుల్ని ఫేస్బుక్ నియంత్రిస్తున్న తీరుపై చాలా దేశాల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది. ఇది అంతకంతకూ పెరిగే అవకాశం కనిపిస్తోంది.