ఫ్యాక్ట్ చెక్ ఎపీ పేరుతో పోలీసులు నిర్వహిస్తున్న వెబ్ సైట్ ట్విట్టర్ హ్యాండిల్ జగన్ మాటలను కవర్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఏదైనా ఫేక్ న్యూస్ అయితే చెప్పాల్సింది పోయి… జగన్ అన్నమాటల్ని.. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో చెప్పాలని ట్రై చేస్తోంది. డబ్బులు ప్రింట్ చేసే కేంద్రం వద్దే డబ్బులు లేవని..సీఎం జగన్ గిరిజనులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అందులో మార్ఫింగ్ ఏమీ లేదు. వర్జినల్ వీడియో. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇది ఆయన అవగాహనా స్థాయిని తెలియచెబుతూండటంతో… ఎలా కవర్ చేసుకోవాలో వైసీపీకి.. ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. అయితే ఫ్యాక్ట్ చెక్ పోలీసులు మాత్రం జగన్ ఇమేజ్‌కు ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని రంగంలోకి దిగారు. అసలు జగన్ పూర్తి వీడియోను చూడాలంటూ పోస్ట్ చేశారు. అందులోనూ అదే ఉంది. అయితే ఏ ఉద్దేశంతో అన్నారో చూడాలంటూ ఓ కవర్ డ్రైవ్ వాడారు. సామాన్యులకు అంటే గిరిజనులకు అర్థమయ్యేలా చెప్పారంటూ వారు చెప్పుకొచ్చారు.
ఫ్యాక్ట్ చెక్ పోలీసుల ఆత్రుత నెటిజన్లను విస్మయానికి గురి చేసింది. అది ఫేక్ అయితే చెప్పాలి కానీ ఇలా వైసీపీ నేతల మాదిరి కవరింగ్ ప్రయత్నాలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోలో ఏముందో సోషల్ మీడియాలో కూడా అదే చెబుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ వెబ్ సైట్ పెట్టినప్పటి నుండి. ఇదే తరహాలో పోస్టులు ఉంటున్నాయి కానీ.. నిజంగా ఫేక్ న్యూస్ ఏమిటో చెప్పే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు.
The trimmed video is misleading and out of context. Please find the full video for your referral.
During the conversation with tribal women from the Polavaram area, Hon'ble CM sir explained the way R&R act (Rehabilitation and Resettlement Act, 2013) works, in simple words. 1/2 https://t.co/N5C4Ya8NCU pic.twitter.com/zLwoCMwR6H
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) July 28, 2022