హిండెన్బెర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత షేర్ వాల్యూ తగ్గిపోతున్నా ఎఫ్పీవోని మూడో రోజు అదానీ సక్సెస్ చేసుకున్నారు. పెట్టుబడిదారులు రఆసక్తి చూపించారని.. రూ. ఇరవై వేల కోట్లు సమీకరించామని చెప్పారు. అయితే పెట్టుబడిదారులు ఎవరో ఎవరికీ తెలియలేదు. అయితే బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్ లో అదానీ షేర్లు కుప్ప కూలడంతో ఎఫ్పీవోను రద్దు చేసుకుంటున్నామని ఎవరి డబ్బులు వారికి వెనక్కి పంపిస్తామని అదానీ గ్రూపు ప్రకటించింది. కానీ అసలు కారణం మాత్రం వేరే ఉందని స్పష్టమయింది.
అదానీ … తన ఎఫ్ పీ వో సక్సెస్ కావడానికి తన డబ్బులే పెట్టుబడిపెట్టారు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ ప్రకటించింది. తనకు చెందిన రెండు కంపెనీల ద్వారా ఎఫ్ పీ వో షేర్లను అదానీ కొనుగోలు చేశారని.. తద్వారా మరో భారీ స్కాంకు తెర లేపారని ఫోర్బ్స్ చెబుతోంది. హఠాత్తుగా రద్దు చేసుకోకపోతే.. ఇది మరో పెద్ద స్కాం అయ్యేదన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే షేర్ ధరను కృత్రిమంగా పెంచడానికి ఇలాంటి మోసాలు అదానీ ఎన్నో చేశారని హిండెన్బెర్గ్ ప్రకటించింది.
ఎఫ్పీవో మొత్తం రోజులు కొనసాగితే.. తొలి రెండు రోజులు మూడు శాతం కూడా సబ్ స్కైబ్ కాలేదు. ఎవరూ షేర్లు కొనలేదు మూడో రోజు మొత్తం సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టారని చెప్పుకున్నారు. ఆ సంస్థాగత పెట్టుబడిదారులంతా అదానీ.. ఆయన సన్నిహితులే. ఇదంతా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి పెరిగిన షేర్ ధర నుంచి డబ్బులు పిండుకోవడానికి చేసిన ప్లాన్ అని ఎవరికైనా అర్థం అయిపోయింది. ఇప్పుడు ఇదంతా బయటపడుతుందని అదానీ గ్రూప్ ఎఫ్ పీ వోను రద్దు చేసినట్లుగా సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఎఫ్ పీ వో ను కొనసాగిస్తే.. ఈ వివాదం మరింత సంచలనం అవుతుంది.
అదానీ గ్రూపులోని అన్ని కంపెనీల షేర్ల ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఈ పతనం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాల్సి ఉంది.