మహేష్ బాబు కథ రిజెక్ట్ చేసిన నేపథ్యంలో, ప్రెస్టీజ్ ఫీలై ఎలాగైనా పెద్ద హీరోతో సినిమా ప్రకటింపచేయాలని ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి, అక్కడ నో అనిపించుకుని, ఆపై బన్నీ దగ్గరకు వెళ్లి ఎస్ అనిపించుకున్నారు దర్శకుడు సుకుమార్.
ఇదీ సినిమా జనాలు చెప్పుకునే గ్యాసిప్. అయితే బన్నీ క్యాంప్ కు సన్నిహితుడైన సుకుమార్ అక్కడ సినిమా చేయడం పక్కా. కానీ ఎప్పుడు? అన్నది అనుమానం. ఎందుకంటే దిల్ రాజు-వేణు శ్రీరామ్ ల ‘ఐకాన్’ సినిమాను ప్రకటించారు. అదే ముందు చేస్తారని పక్కాగా వార్తలు వచ్చాయి.
కానీ, ఇప్పుడు ఉన్నట్లుండి బన్నీ-సుకుమార్ సినిమాకు ముహుర్తం అంటూ డేట్ లు వినిపిస్తున్నాయి. ఏమిటీ? హడావుడి? బన్నీ నిర్ణయం మార్చుకున్నాడా? వేణు శ్రీరామ్ సినిమాను వెనక్కు పెట్టారా? సుకుమార్ స్క్రిప్ ఫుల్ గా రెడీ అయిపోయిందా?
ఇవేవీ కాదు, అసలు విషయం వేరు అన్న టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీస్ కు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు వచ్చాయి. సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంథోనీ, డియర్ కామ్రేడ్ ఇలా వరుసగా. డియర్ కామ్రేడ్ రీజనబుల్ ధరలకే అమ్మినందున గట్టెక్కిపోతామని అనుకున్నారు. కానీ బయ్యర్లు దాదాపు నలభై నుంచి యాభైశాతం నష్టపోతున్నారు. ఇప్పుడు వాళ్లందరికీ సర్దుబాటు చేయాలి.
మరోపక్క గ్యాంగ్ లీడర్ సినిమాను స్మూత్ గా విడుదల చేయాలి. దానికి కాస్త మంచి రేటు రాబట్టాలి. ఎందుకంటే అది యాభై కోట్ల సినిమా. కనీసం నలభై కోట్లు అన్నీ థియేటర్ రైట్స్ మీద రావాలి. అలాగే మొత్తం డియర్ కామ్రేడ్ బాకీలు అన్నీ దాని మీదే పడిపోకూడదు.
ఇలా అంతా స్మూత్ గా జరిగిపోవాలి అంటే, తరువాత మరో ప్రామిసింగ్ ప్రాజెక్టు కళ్ల ముందు బయ్యర్లకు కనిపించాలి. అందుకే అర్జెంట్ గా సుకుమార్ -బన్నీ సినిమా లాంచ్ చేయడం. వీలైతే ఓ షెడ్యూలు చేసి ఆపడం. అప్పుడు బయర్లకు నమ్మకం వస్తుంది. అలాగే ఎన్టీఆర్ తో, మహేష్ తో సినిమాలు లైన్లో వున్నాయని కూడా ముందే చెప్పడం కూడా ఇందుకోసమే.
వాస్తవానికి అయితే ముందుగా విడుదలయ్యేది బన్నీ-దిల్ రాజు-వేణు శ్రీరామ్ సినిమానే. ఎందుకంటే అది బౌండ్ స్క్రిప్ట్ వుంది. పైగా ఆ డైరక్టర్ ది కూడా సుకుమార్ లా ఏళ్లకు ఏళ్లు సినిమాను చెక్కే వ్యవహారం కాదు.