గతంలో అమరావతిలో ఎలాంటి కుట్రలు చేశారో.. ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేశారో.. అలాంటివే వైసీపీ అండ్ మూక ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. సాక్షిలో రోజుకో కథనం రాస్తున్నారు. యూజర్ చార్జీలని..భూములని.. స్కాములని.. అప్పులని ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోతున్నారు. ఇవన్నీ గతంలో చేసిన ఆరోపణలే కొత్తవేం కాదు. సోషల్ మీడియాలోనూ అవే అవాస్తవాలతో విరుచుకుపడుతున్నారు. దీనికి ఇప్పుడే కళ్లెం వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
అమరావతి నిర్మాణానికి అప్పులు తెస్తున్నారని అవి కట్టడానికి ప్రజలపై భారం వేస్తారని ప్రచారం చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి తెచ్చే దాంట్లో సగం కేంద్రం కడుతుంది. మిగతా సగం అమరావతి డెవలప్ అయ్యాక భూములు అమ్మి ఆ అప్పులు తీరుస్తారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని ప్రభుత్వం చెబుతోంది. ప్రజలపై రూపాయి భార పడదని చెబుతోంది. కానీ దీన్ని సరైన విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం విఫలం అవుతున్నారు. అప్పులు చేస్తున్నారని అది ఎవరు కడతారని అంటున్నారు.. అమరావతినే కట్టుకుంటుందని చెప్పడంలో విఫలమవుతున్నారు.
అమరావతి అనేది అందరి రాజధాని. అది ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు. అది అన్ని ప్రాంతాల ప్రజల ఆస్తి. అక్కడ జనరేట్ అయ్యే ప్రతి రూపాయి ఆదాయం రాష్ట్ర ప్రజలకే చెందుతుంది. ఓ హైదరాబాద్, ఓ బెంగళూరు, ఓ చెన్నై ఆయా రాష్ట్రాలకు ఎలా కల్పతరువో.. అమరావతి కూడా అలాగే అవుతుంది. విశాఖ నుంచి వచ్చే ఆదాయం ఒక్క. విశాఖే తీసుకోవడం లేదు.. రాష్ట్ర ప్రజలకు అందుతోంది. అలాగే అమరావతి కూడా. సొంత రాష్ట్రంపై కుట్రలు చేసే వారి మాయలో ప్రజలు మళ్లీ పడకుండా ప్రభుత్వమ సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలి.