కేసీఆర్ 22 ల్యాండ్ క్రూజర్ కార్లు కొని విజయవాడలో దాచి పెట్టారని రేవంత్ రెడ్డి చెప్పిన అంశం వైరల్ అయింది. చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు.. మీడియాపై ఎదురుదాడి చేస్తున్నారు. పాత పేపర్ క్లిప్పులతో విమర్శలు చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని… తప్పు అంటున్నారు. అయితే ఈ అంశంపై నిజానిజాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి.
22 ల్యాండ్ క్రూజర్ కార్లు విజయవాడలో ఉన్నది నిజమే !
కేసీఆర్ గతంలో కూడా కాన్వాయ్ కార్లను కొన్నారు. ఆ పేపర్ కటింగ్లను .. చూపించి బీఆర్ఎస్ నేతలు… కార్యకర్తలు ఇది పాత వార్తేనని వాదిస్తున్నారు. కానీ.. నిజం ఏమిటంటే.. కేసీఆర్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుగోలు చేశారు. మూడో సారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త వాటినే వాడాలనుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పారు. గతంలో కొన్న వాహనాలను బులెట్ ఫ్రూఫ్ చేయించి తీసుకుని వాడుకుంటున్నారు కూడా. అందులో అవి విజయవాడలో ఉండటానికి అవకాశం లేదు.
విజయవాడలో దాచలేదు బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తున్నారు !
అయితే కేసీఆర్ విజయవాడలో వాటిని దాచారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంలో పాక్షిక నిజం ఉంది. వాటిని దాచారనడం కరెక్ట్ కాదని.. బుల్లెట్ ఫ్రూఫ్ చేయిస్తున్నారని అంటున్నారు. దేశంలో వీఐపీల కార్లకు…బుల్లెట్ ఫ్రూఫ్ చేసే సంస్థ విజయవాడ సమీపంలో ఓ పెద్ద గ్యారేజీని నిర్వహిస్తోంది. అక్కడ అత్యంత ఖరీదైన కార్ల బుల్లెట్ ప్రూఫింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ఆ పనులు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ కార్లన్నీ గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక కార్గో విమానంలో తీసుకు వచ్చారని చెబుతున్నారు బుల్లెట్ ప్రూఫ్ చేసే గ్యారేజీ విజయవాడలో ఉంది కాబట్టి… చేస్తున్నారు… అక్కడ దాచారనడం కరెక్ట్ కాదని అనుకోవచ్చు.
దమ్ముంటే అంబులెన్స్ లుగా మార్చాలని బీఆర్ఎస్ సవాల్
అయితే ఈ 22 వాహనాల అంశం పాతదని బీఆర్ఎస్ కార్యకర్తలు వాదిస్తున్నప్పటికీ.. బీఆర్ఎస్ అధికార ప్రతనిధి, తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన దాసోజు శ్రవణ్… కొన్నట్లుగా అంగీకరించారు. ఇలాంటి విషయాలు ఏ ప్రభుత్వం బయటకు చెప్పదన్నారు. దమ్ముంటే వాటిని అంబులెన్స్ లు గా మార్చాలని సవాల్ చేశారు. దాసోజు శ్రవణ్ స్పందిన తర్వాత… 22 క్రూజర్ ల మ్యాట్‌లో అంతా నిడమేఉందని తేలిపోయింది. విజయవాడలో దాచడం కాకుండా.. అక్కడ బుల్లెట్ ప్రూఫింగ్ చేయిస్తున్న అంశంలో మాత్రమే కాస్త మాట తేడా వచ్చిందని అనుకోవచ్చు.