ఎన్నికల వేళ మీడియా, సోషల్ మీడియా చాలా చురుగ్గా ఉంటుంది. ఏ పార్టీ నాయకుడు ఏ చిన్న తప్పు చేసిన ప్రత్యర్థి పార్టీలను అభిమానించే మీడియా దాన్ని హైలెట్ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉంటుంది. అయితే నిన్న పవన్ కళ్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకునే సందర్భంలో జనాన్ని తోసుకుంటూ వెళ్లాడంటూ సాక్షి ఛానల్, సాక్షి పత్రిక ఒక కథనాన్ని వెల్లడించింది. దీంతో వైఎస్సార్సీపీ అభిమానులు, జగన్ను ఆరాధించే వెబ్ సైట్లు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద నిన్న ఈ అంశం పై నెగటివ్ కథనాలు వెలువరించాయి. అయితే అక్కడ నిజానికి ఏం జరిగింది.
పవన్ కళ్యాణ్ పోలింగ్ బూత్ కు చేరుకొని, ముందు కాసేపు క్యూలైన్లో నుంచున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ అక్కడ క్యూలో నించున్న కారణంగా గా పోలింగ్ బూత్ లో వాతావరణం మొత్తం మారిపోయింది. పరిస్థితి గమనించిన ఆఫీసర్స్, పరిస్థితి చేయి దాటక ముందే, ఇతర ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం , పవన్ కళ్యాణ్ ని తామే వచ్చి లోపలికి రమ్మని ఆహ్వానించారు. దీంతో పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా, అప్పుడు కూడా అభిమానులు పవన్ కళ్యాణ్ వద్దకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే పవన్ కళ్యాణ్ పోలింగ్ అధికారులతో పాటు నేరుగా లోపలికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లిపోయాడు.
అయితే ఈ సంఘటనను సాక్షి వక్రీకరించిన తీరు మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయం. పోలింగ్ అధికారులు పవన్ కళ్యాణ్ ని లోపలకు ఆహ్వానించిన విషయాన్ని, తమతో పాటు తీసుకెళ్లిన విషయాన్ని దాచి పెట్టి, పవన్కళ్యాణ్ నిజంగా జనాల్ని తోసుకెళ్లినట్లు గా ఎటువంటి వీడియో చూపించకుండానే చేసిన కథనాలు ప్రజలను విస్మయ పరుస్తున్నాయి.